India Pakistan War: దేశాల మధ్య యుద్ధం.. వాళ్లకి ఆయుధాల వ్యాపారం

భారత్‌-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఇతర దేశాలకు మాత్రం ఇది వ్యాపారంగా మారిపోయింది. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా దేశాలకు ఇది కలిసొచ్చింది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
India Pakistan War is Business for other Countries

India Pakistan War is Business for other Countries

ఇటీవల భారత్‌-పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచాన్ని ఇరుదేశాల వైపు చూసేలా చేశాయి. పహల్గాం ఉగ్రదాడి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసింది. ఆ తర్వాత భారత్‌ పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్‌ చేపట్టింది. 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అనంతరం పాక్‌ భారత్‌పై డ్రోన్లు, మిసైల్స్, ఫైటర్‌ జెట్లతో దాడులకు యత్నించింది. కానీ భారత్‌ వాటిని తిప్పికొట్టింది. అలాగే పాక్‌లోని పలు ఎయిర్‌బేస్‌లను కూడా ధ్వంసం చేసింది. 

ఇలా భారత్‌-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఇతర దేశాలకు మాత్రం ఇది వ్యాపారంగా మారిపోయింది. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా దేశాలకు ఇది కలిసొచ్చింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు ఎగుమతి చేయడంలో ఈ దేశాలే టాప్‌లో ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్.. దాదాపు 80 శాతం ఆయుధాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మన భారత్‌ రష్యా నుంచి ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటోంది. అమెరికా కూడా ఈ రెండు దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేస్తోంది. 

Also Read: నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?

India Pakistan War 2025

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా టర్కీతో భారీ డిఫెన్స్‌ డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 304 మిలియన్ డాలర్ల విలువైన క్షిపణులను విక్రయించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. మన కరెన్సీలో చూసుకుంటే దీని విలువ దాదాపు రూ.2 వేల 300 కోట్లు. ఈ ఒప్పందం కింద 53 అడ్వాన్స్‌డ్‌ మీడియం రేంజ్‌ ఎయిర్ టు ఎయిర్‌ క్షిపణులు, అలాగే 60 బ్లాక్ 2 మిసైల్స్‌ను అందించనుంది. అయితే.. పాక్ కోసమే టర్కీ ఈ ఆయుధాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా పాక్ పై ఒత్తిడి తీసుకువచ్చి ఈ డీల్ చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ కు ఐఎంఎఫ్‌ నుంచి రూ.8,738 కోట్ల రుణం ఇప్పించింది అమెరికా. ఈ డబ్బులతోనే ఆయుధాలను కొనడానికి ఇప్పుడు పాకిస్తాన్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ డీల్ మొత్తం పూర్తయితే.. అమెరికా ఇప్పించిన రూ.8 కోట్ల అప్పు తిరిగి మళ్లీ ఆదేశ ఖజానాలోకే వచ్చి జమ కానున్నాయి. అమెరికా.. వివిధ దేశాల యుద్ధాల్లో ఎందుకు వేలు పెడుతుంది? అన్నది ఈ డీల్ చూస్తే అర్థం చేసుకోవచ్చు.

పాక్ ఎంత యుద్ధం చేస్తే చైనాకు కూడా అంత మంచిది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) డేటా ప్రకారం చూసుకుంటే గత ఐదేళ్లలో పాకిస్థాన్ 81 శాతం ఆయుధాలు చైనా నుంచే దిగుమతి చేసుకుంది. ఆ ఎగుమతుల్లో అధునాతన యుద్ధ విమానాలు, మిసైల్స్, రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. పాకిస్తాన్, భారత్ మధ్య జరిగే యుద్ధంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రెండు దేశాల మధ్య దాదాపు 5.28 బిలయన్ డాలర్ల ఆయుధ వ్యాపారం ఇటీవల జరిగింది. చైనా డిసెంబర్ 2024 నాటికి పాకిస్తాన్ కు రూ.2.42 లక్షల కోట్లు అప్పు ఇచ్చింది. చైనా పాక్ కు అప్పులు ఇవ్వడం వెనుక రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒకటి.. భారత్-చైనా సరిహద్దుల్లో దూరి మన ప్రాంతాలను స్వాధీనం చేసుకునే కుట్ర. రెండవది.. పాక్ తో భారీగా ఆయుధాలను కొనిపించి లాభపొందడం.
 
రష్యా-భారత్ మధ్య 20 బిలియన్ డాలర్ల ఆయుధ డీల్ నడిచింది. భారత్ రష్యా నుంచి S-400 లాంటి అతిపెద్ద డిఫెన్స్ సిస్టాన్ని కొనుగోలు చేస్తోంది. అయితే.. భారత్ ఆయుధ కొనుగోళ్లను  రానురాను తగ్గిస్తూ వస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో బ్రహ్మోస్, ఆకాశ్ లాంటి క్షిపణులను తయారు చేసి శత్రుదేశాలకు చుక్కలు చూపిస్తోంది. 

Also Read :  అలేక్య చిట్టి పికిల్స్ సిస్టర్ నటిస్తున్న సినిమా ఇదే.. వీడియోలు చూశారా?

2018-2022 వరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ వరుసగా అతిపెద్ద ఎగుమతిదారులని ఓ నివేదిక తెలిపింది. ఈ ఈ ఐదేశాలు 2018 నుంచి 2022లో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో ఏకంగా 76 శాతం సరఫరా చేశారు. 2024లో అమెరికా 318.7 బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను అమ్మింది. 2023 నాటికి  అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచింది. 2018 -2022 మధ్య ప్రపంచ ఆయుధాల ఎగుమతుల్లో దీని వాటా ఏకంగా 40 శాతం ఉంది. 

రెండో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా రష్యా నిలిచింది. ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో దీని వాటా 16 శాతం వరకు ఉంది. గతంలో దీని వాటా 24.1 శాతం ఉండేది. 2012 నుంచి తగ్గుతూ వచ్చింది. 2021లో అది 18.6 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత 16 శాతానికి వచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల దాని ఎగుమతులు మందగించాయి. 

Also Read: ఛీ.. ఛీ.. సిగ్గులేని పాకిస్తాన్ ...ఉగ్రవాదులకు మరోసాయం!

ఇక మూడో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా ఫ్రాన్స్ నిలిచింది. 2018 నుంచి -2022లో.. ప్రపంచ ఆయుధ అమ్మకాల్లో ఫ్రాన్స్ వాటా 11 శాతంగా ఉంది. 2013-17 నుంచి 2018-22 వరకు ఫ్రాన్స్ ఆయుధ ఎగుమతులు 44 శాతానికి పెరిగిపోయాయి. ఇక నాలుగో అతిపెద్ద ఎగుమతి దారుగా చైనా ఉంది. 2018-2022లో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో చైనా వాటా 5.2 శాతంగా ఉంది. అయితే చైనా ఆయుధ ఎగుమతుల్లో 80 శాతం ఆసియా, ఓషియానియా దేశాలకు సరఫరా అవుతాయి. ఇక ఐదో  అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచిన జర్మనీకి 2018-2022లో ప్రంపంచ ఆయుధ అమ్మకాల్లో 4.2 శాతం వాటా ఉంది. 

Also Read :  తారక్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. బర్త్ డేకు సర్ప్రైజ్‎లే.. సర్ప్రైజ్‎లే! హృతిక్ అదిరిపోయే గిఫ్ట్

india-pakistan | weapons | telugu-news | rtv-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు