Pakistan: భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్‌ కుట్ర !

పాక్‌ చైనాతో కలిసి భారత్‌పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్‌ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం.

New Update
Pakistan preparing for war against India with China Support, Sources

Pakistan preparing for war against India with China Support, Sources

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు చల్లారిన సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు పాక్‌ చైనాతో కలిసి భారత్‌పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్‌ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే భారత్‌లో సైన్యం కోసం బడ్జెట్‌ను రూ.50 వేల కోట్లు పెంచుతారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

Also Read: విద్యార్థులను అక్కడ తాకుతూ.. అరచేతిపై ఫోన్ నంబర్‌ రాసి చివరికి - ప్రొఫెసర్ అరాచకం!

Pakistan War Against India With China

ఈ విషయం బయటికి రావడంతో అప్రమత్తమైన పాకిస్తాన్‌ మరిన్ని ఆయుధాలు సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌ ఎయిర్‌బేస్‌లపై భారత్‌ దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అందుకే పాక్‌ తమ రక్షణ రంగాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం.    

Also Read: దేశ సైన్యం మోదీ పాదాలకు నమస్కరిస్తుంది.. డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు: VIDEO

ఇప్పటికే పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌ (IMF) వచ్చింది. ఇందులో వచ్చిన డబ్బులతోనే చైనా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చైనా పాక్‌కు ఇందులో డిస్కౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇదిలాఉండగా చైనా తన ఆర్థిక ప్రయోజనాల కోసం పాకిస్థాన్‌ను వాడుకుంటోంది. 2017లో చైనా తమ దేశానికి చెందిన వివిధ కంపెనీల ద్వారా.. పాకిస్థాన్ స్టాక్ ఎక్స్‌చెంజ్ (PSE)లో 40 శాతం వాటా కొనుగోలు చేసింది.  

Also Read: పాకిస్తాన్ నుండి విడిపోవడం అంత ఈజీ కాదు.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలంటే ఏం చేయాలి?

Also Read: ఇజ్జత్ పోయిందిపో... సొంత దేశంలోనే పాకిస్తాన్‌కు ఘోర అవమానం

 

 rtv-news | china | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు