/rtv/media/media_files/2025/05/16/XEwZYtUK2OwWvA2GU6z0.jpg)
Tiranga Rally Vijayawada
Tiranga Rally Vijayawada: విజయవాడలో తిరంగా ర్యాలీకి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఈ ర్యాలీ నిర్వహణ జరుగుతోంది. భారత సైనికులకు(Indian Army) మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) కూటమి పార్టీలు (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా సైనికులపై దేశ ప్రజల గౌరవాన్ని, మద్దతును వ్యక్తపరిచే లక్ష్యంతో, సెప్టెంబర్ 16 తేదీ సాయంత్రం 7 గంటలకు విజయవాడ నగరంలో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ నేతలు హాజరు
ఈ ర్యాలీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డా. పురందరీశ్వరి హాజరవుతారు. దీంతో పాటు పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, ఇతర ప్రముఖ నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!
ర్యాలీ జరిగేది ఇక్కడే..
ఈ ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ దాకా సాగనుంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీ కోసం ట్రాఫిక్‌ను పూర్తిగా బందర్ రోడ్ వద్ద నిలిపివేయనున్నారు. ర్యాలీ సందర్భంగా వాహనాల రాకపోకలను నిషేధించినట్టు పోలీసులు ఇప్పటికే తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Also Read: Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే
దేశభక్తి ప్రాధాన్యత తెలిపేలా..
ర్యాలీలో భాగంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్య కూడళ్లలో డప్పులు, గరగ నృత్యాలు, తప్పెట గుళ్ళు, దేశభక్తి గీతాల తోరణాలతో దేశ భక్తిని ప్రజల్లో నింపేలా వేడుకలను జరుపుతున్నారు. 500 మీటర్ల పొడవైన జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొననున్నారు.
Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
ర్యాలీలో భారీగా జనం..
ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి జాతీయ పతాకం అందచేసి, ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసేందుకు తాత్కాలిక మెడికల్ క్యాంపులు, చల్లటి తాగునీటి స్టాళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భారీగా జనం రాబోతున్న నేపథ్యంలో అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
పహల్గామ్ దాడికి(Pahalgam Terror Attack) భారత సైన్యం ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయాన్ని గుర్తు చేస్తూ, తిరంగా ర్యాలీ దేశభక్తికి చిహ్నంగా మారనుంది. మూడు పార్టీలు కలయికతో ప్రజలలో జాతీయతా స్పూర్తిని చాటుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు.