BIG BREAKING: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. అణు బెదిరింపులకు లొంగేది లేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. 

New Update
Rajanath Singh

Rajanath Singh

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శత్రు స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేశామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అమరులు అయిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఒక పేరు కాదని.. కమిట్‌మెంట్ అని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత సైన్యం దాడులు నిర్వహించి విజయం సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. 

ఇది కూడా చూడండి:Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్

ఇది కూడా చూడండి:Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం

సైనికులు అందరికీ సెల్యూట్..

ఆపరేషన్ సిందూర్‌ సక్సెస్ అయ్యిందని, దీన్ని సక్సెస్ చేసిన సైనికులు అందరికీ కూడా సెల్యూట్ అని తెలిపారు. మిమ్మల్ని చూసి దేశమంతా కూడా గర్విస్తోందన్నారు. ఈ ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను అంతం చేశామన్నారు. అణు బెదిరింపులకు లొంగేది లేదని, ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. 

ఇది కూడా చూడండి:Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు

Advertisment
తాజా కథనాలు