🔴LIVE BREAKINGS: రష్యాకు బిగ్ షాక్.. 11 ఏళ్ల తర్వాత యూరప్ కోర్టు సంచలన తీర్పు!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

IND vs ENG : ఇవాళే మూడో టెస్టు... గిల్ ముందు అదిరిపోయే రికార్డులు!

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ ల సిరీస్ లో  భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లు పూర్తయ్యాయి. లీడ్స్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ ను 336 పరుగుల తేడాతో భారత్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ ల సిరీస్ లో  భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లు పూర్తయ్యాయి. లీడ్స్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ ను 336 పరుగుల తేడాతో భారత్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. సిరీస్ ఇప్పుడు 1-1తో సమంగా ఉంది. మూడో మ్యాచ్  ఈ రోజు (జూలై 10) నుండి ప్రారంభం అవుతుంది.  

Also Read :  బ్రెజిల్ తో పాటూ 8 దేశాలపై 50 శాతం సుంకాలు

లార్డ్స్‌లో భారత్ రికార్డు

లార్డ్స్‌లో భారత్ ఇప్పటివరకు 19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి వాటిలో 3 మాత్రమే గెలిచింది. 1986లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలి మ్యాచ్‌ను, 2014లో ఎంఎస్ ధోని నాయకత్వంలో రెండో మ్యాచ్‌ను భారత్ గెలుచుకుంది. 2021లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో మూడో మ్యాచ్‌ను 151 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఆ మ్యాచ్‌లో, కెఎల్ రాహుల్ భారత్  తరపున 129 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు.  

1932లో లార్డ్స్‌లో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ సమయంలో, భారత్‌కు సి.కె. నాయుడు నాయకత్వం వహించారు. ఇంగ్లాండ్‌కు డగ్లస్ జార్డిన్ నాయకత్వం వహించారు. ఆ మ్యాచ్‌లో భారత్ 158 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత, లార్డ్స్‌లో తొలి టెస్ట్ విజయం కోసం భారత్ 54 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. 1986లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలి విజయం సాధించారు.

శుభ్‌మన్ గిల్‌కు ఇప్పుడు రికార్డుల్లో తన పేరు లిఖించుకునే సువర్ణావకాశం లభించింది. లార్డ్స్‌లో టెస్ట్ గెలిచిన నాల్గవ భారత కెప్టెన్‌గా అతను రికార్డు సృష్టించగలడు. గిల్ తొలిసారి లార్డ్స్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. 25 ఏళ్ల భారత కెప్టెన్ రెండు మ్యాచ్‌ల్లో 585 పరుగులు చేశాడు, ఇందులో రెండు అద్భుతమైన సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. ప్రస్తుత సిరీస్‌లో కెప్టెన్  గిల్‌ 585 పరుగులు చేశాడు. అతను మరో 18 పరుగులు సాధిస్తే ఇంగ్లాండ్‌లో ఆడిన ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా 2002లో ద్రవిడ్‌ నెలకొల్పిన రికార్డును బద్దలు కొడతాడు.

Also Read :  విజయ్‌ దేవరకొండ, రానాలపై ఈడీ కేసు నమోదు!

మూడో టెస్టుకు  భారత్ ఒక  మార్పుతో  బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ప్రసిద్ధ్‌ కృష్ణ స్థానంలోకి బుమ్రా వచ్చే అవకాశముంది. ఒక ఇంగ్లాండ్ టీమ్ కూడా జోష్‌ టంగ్‌ స్థానంలో ఆర్చర్‌ను ఎంచుకుని ఇంకే మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.  

Also Read :  Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్

లార్డ్స్‌లో ఇంగ్లాండ్ రికార్డు

ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో టెస్ట్ రికార్డు గురించి మాట్లాడుకుంటే, ఆ జట్టు ఇక్కడ 145 మ్యాచ్‌లు ఆడి 59 గెలిచి 35 మ్యాచ్‌లలో ఓడిపోయింది. 51 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

Also Read :  Mega Teacher Parent Meet 2.0: నేడే మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0

LIVE BREAKINGS

  • Jul 10, 2025 21:30 IST

    ఇదేందయ్యా ఇది.. మహిళా ఓటర్‌ కార్డుపై CM నితీశ్‌ కుమార్ ఫొటో

    బిహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ఓటరు కార్డుపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌ కుమార్‌ ఫొటో ఉన్నది. ఇది చూసి ఆ మహిళ, ఆమె భర్త షాక్ అయ్యారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారు మండిపడ్డారు.

    Woman Voter Card



  • Jul 10, 2025 20:55 IST

    నలుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసిన గుజరాత్ ప్రభుత్వం

    గుజరాత్‌ వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇందులో నిర్లక్ష్యం వహించిన నలుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. రాష్ట్ర రోడ్లు, భవనాల విభాగానికి చెందిన నలుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేశారు.

    bridge-collopse



  • Jul 10, 2025 20:54 IST

    BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

    ఏపీ మద్యం కేసులో విజయసాయిరెడ్డికి సిట్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది. జూలై 12న విచారణకు రావాలని ఆదేశించింది. ఉదయం 10 గంటలకు సిట్‌ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో సిట్‌ అధికారులు విజయసాయిరెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే.

     

    Vijayasai Reddy
    Vijayasai Reddy

     



  • Jul 10, 2025 17:59 IST

    Plane Crash: గాల్లో ఢీకొన్న శిక్షణ విమానాలు.. భారతీయ విద్యార్థి మృతి

    కెనడాలోని ఓ ఫ్లైట్ స్కూల్‌లో పైలట్‌ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తుండగా రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్‌ విద్యార్థులు మృతిచెందారు. వీరిలో ఒకరు ఇండియాకు చెందిన చెందిన యువకుడు శ్రీహరి సుఖేష్‌ (23) ఉన్నాడు.

     

    Indian student among two killed as planes collide mid-air in Canada
    Indian student among two killed as planes collide mid-air in Canada

     



  • Jul 10, 2025 17:58 IST

    Microsoft: ఆ ఉద్యోగుల ఉసురు పోసుకుని.. 4 వేల కోట్లు మిగుల్చుకున్న మైక్రోసాఫ్ట్.. షాకింగ్ లెక్కలు!

    ఇటీవల ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ భారీగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. దాదాపు 9 వేల మందికి పైగా లేఆఫ్‌ నోటీసులు పంపించింది. అయితే గతేడాది తమ కంపెనీ ఏఐ వల్ల రూ.4 వేల కోట్లు ఆదా చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.

    Microsoft To Lay Off



  • Jul 10, 2025 17:57 IST

    Karnataka: కర్నాటకలో సీఎం మార్పు.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన

    ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ప్రచారాన్ని సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు. తానే ఐదేళ్లు సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. డీకే శివకుమార్‌ను సీఎం చేయడం కోసం తనను హైకమాండ్ రాజీనామా చేయాలని కోరిందన్న ప్రచారం అవాస్తవమన్నారు.

     

    CM Siddaramaiah
    CM Siddaramaiah

     



  • Jul 10, 2025 14:35 IST

    Fighter Jet Crash: నెల రోజుల క్రితమే తండ్రయ్యాడు.. అంతంలోనే విమాన ప్రమాదంలో మృతి

    రాజస్థాన్‌లోని చురూ జిల్లాలో బుధవారం ఓ ఫైటర్‌ జెట్‌ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అయితే వీళ్లలో లోకేందర్ సింగ్‌ అనే పైలట్ నెల రోజుల క్రితమే తండ్రయ్యాడు. జూన్ 10న ఆయన భార్య మగ శిశువుకు జన్మనిచ్చింది.

     

    IAF Pilot Killed In Jaguar Crash Became A Father A Month Ago
    IAF Pilot Killed In Jaguar Crash Became A Father A Month Ago

     



  • Jul 10, 2025 13:13 IST

    రష్యాకు బిగ్ షాక్.. 11 ఏళ్ల తర్వాత యూరప్ కోర్టు సంచలన తీర్పు!

    ఉక్రెయిన్‌లో మలేషియా విమానాన్ని రష్యానే కూల్చిందంటూ 11 ఏళ్ల తర్వాత రష్యా కోర్టు తీర్పునిచ్చింది. 2014 జులై 17న ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి కౌలాలంపూర్‌కు వెళ్తున్న బోయింగ్ 777 విమానంపై దాడి చేశారు. మొత్తం 283 మంది ప్రయాణికులు, 15 మంది క్రూ సిబ్బంది మృతి చెందారు.

     

    Russia
    Russia

     



  • Jul 10, 2025 13:00 IST

    కాంగ్రెస్కు బిగ్ షాక్.. శశిథరూర్ ఔట్ !

    ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సంచలన  వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని విమర్శిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలున్నాయి

    sashithroor



  • Jul 10, 2025 11:58 IST

    భూవివాదంలో నటి శిల్పా చక్రవర్తి.. ఎస్సై కి నోటీసులు

    టీవీ నటి శిల్పా చక్రవర్తి  భూవివాదంలో పోలీసులు జోక్యం పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన కేసు ఇంకా కోర్టులో నడుస్తుండగా.. ఇంజెక్షన్ ఆర్డర్ అమల్లో ఉండగా జోక్యం చేసుకోవలసిన అవసరమేంటి అని పోలీసులను ప్రశ్నించింది. 

     

    Shilpa Chakraborty
    Shilpa Chakraborty

     



  • Jul 10, 2025 11:36 IST

    మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి!

    గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దళం మరోసారి తీవ్రమైన దాడులు చేసింది. హమాస్ లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు మరణించారు.

     

    Gaza
    Gaza

     



  • Jul 10, 2025 10:59 IST

    తిరుమలను దర్శించుకున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత

    నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్ కె లోహిత్ ఇటీవల తిరుమలలోని పవిత్ర వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. త్వరలో తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న తన రాబోయే ద్విభాషా చిత్రం “జన నాయకుడు” కోసం తిరుమలను ఎన్‌ కె లోహిత్ దర్శించుకున్నారు.

     

    Producer of KVN Productions
    Producer of KVN Productions

     



  • Jul 10, 2025 10:58 IST

    ట్రంప్ పై ఇరాన్ డ్రోన్ దాడి?

    తమపై దాడులు చేసినందుకు అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. ప్రస్తుతానికి కామ్ గా ఉన్నా ఎప్పటికైనా ఆ దేశంపై దాడులు చేయవచ్చని సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ పై డ్రోన్ దాడి చేస్తామని హెచ్చరించారు. 



  • Jul 10, 2025 10:58 IST

    కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం! ముగ్గురు స్పాట్ డెడ్

    కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి కడప జిల్లా మైదుకూరు వెళ్తుండగా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలో వారి స్కార్పియో వాహనం ట్రాక్టర్ ని ఢీకొట్టింది.



  • Jul 10, 2025 09:29 IST

    దేశ రాజధానిలో భారీ భూకంపం.. వణికిన ఢిల్లీ

    ఢిల్లీలో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1 గా నమోదైంది. ఘజియాబాద్, నోయిడా ప్రాంతలలోని ప్రజలు భూకంప ప్రకంపనలను భయాందోళకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

    delhi



  • Jul 10, 2025 09:19 IST

    ఎంతకు తెగించావ్రా ప్రిన్సిపాల్.. పీరియడ్స్‌లో ఉన్నారో లేదో చెక్‌ చేయడానికి బాలికల బట్టలిప్పి!

    మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షాపూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బాత్రూమ్ లో రక్తపు మరకలు కనిపించడంతో దానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి చాలా దారుణంగా వ్యవహరించింది.

    shool-girl



  • Jul 10, 2025 09:00 IST

    మరోసారి ఆసుపత్రికి కేసీఆర్

    తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రికి నేడు వెళ్లనున్నారు. పరీక్షల కోసం వెళ్లనున్నట్లు సమాచారం. గతవారమే తీవ్ర జ్వరంతో కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం కాస్త మెరుగు కావడంతో పరీక్షల కోసం మళ్లీ ఆసుపత్రికి వెళ్లనున్నారు.

    KCR



  • Jul 10, 2025 08:59 IST

    చంపేశారా, చనిపోయిందా.. నర్సు దివ్యశ్రీ అనుమానాస్పద మృతి!

    అనంతపురం జిల్లా సవేరా హాస్పిటల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న  దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  నైట్ డ్యూటీ చేసి హాస్టల్‌కు వెళ్లిన దివ్యశ్రీ కన్నుమూసింది. ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడిన దివ్య మధ్యాహ్నాం మరణించింది.

    divya



  • Jul 10, 2025 08:58 IST

    యూఎస్ వెళ్లాలనుకునే వారికి బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం!

    యూఎస్ వెళ్లాలనుకునేవారికి ట్రంప్ సర్కార్ మళ్ళీ షాక్ ఇచ్చింది. అన్ని రకాల వీసా ఫీజులను పెంచేసింది. వచ్చే ఏడాది నుంచి ఇంటెగ్రిటీ ఫీజు కింది 250 డాలర్లను అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. 

     

    US Visa
    US Visa

     



  • Jul 10, 2025 08:57 IST

    అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. తండ్రిని చంపి ఆ తర్వాత సెకండ్‌షోకి!

    వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని హైదరాాబాద్‌లో ఓ కూతురు తండ్రిని చంపింది. తన తల్లి, ప్రియుడు సాయంతో అతన్ని చంపి చెరువులో పడేసి, ఆ తర్వాత సెకండ్ షోకి వెళ్లారు. చెరువులో శవం కనిపించి విచారణ చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది.



  • Jul 10, 2025 08:04 IST

    బ్రెజిల్ తో పాటూ 8 దేశాలపై 50 శాతం సుంకాలు

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ వార్ ను మరింత తీవ్ర తరం చేశారు. తాజాగా బ్రెజిల్ తో సహా మరో 8 దేశాలపై 50 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. అందరిలాగే ఈ దేశాలకూ ఆగస్టు 1 నుంచి టారీఫ్ లు అమలు కానున్నాయి. 

     

    READ MORE



  • Jul 10, 2025 08:03 IST

    విజయ్‌ దేవరకొండ, రానాలపై ఈడీ కేసు నమోదు!

    టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్‌ దేవరకొండ, రానాలకు ఈడీ బిగ్ షాకిచ్చింది. వీరిపై ఈడీ కేసు నమోదు చేసింది.  బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది.

    vijay-rana

     



  • Jul 10, 2025 08:02 IST

    నిలువుగా విరిగిన వికెట్.. క్రికెట్ లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

    క్రికెట్ లో ఎప్పుడు చూడని ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.  వైటాలిటీ టీ20 బ్లాస్ట్ 2025లో భాగంగా సోమర్‌సెట్, ఎసెక్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ పేసర్ రిలే మెరెడిత్ అద్భుతమైన యార్కర్‌తో  స్టంప్‌ను సగానికి విడగొట్టాడు.

    bowler

     



  • Jul 10, 2025 08:02 IST

    అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్



  • Jul 10, 2025 08:01 IST

    టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రివ్యూ చూస్తుండగా బ్రెయిన్‌ స్ట్రోక్‌.. దర్శకుడు మృతి!

    డైరెక్టర్ సండ్రు నగేష్‌ అలియాస్‌ రాంబాబు(47)  బ్రెయిన్‌ స్ట్రోక్‌ తో కన్నుమూశారు.  తాను దర్శకత్వం వహించిన బ్రహ్మాండ రిలీజ్ కు దగ్గరలో ఉండటంతో ప్రివ్యూ చూస్తూ  బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై  ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

    amani-director



  • Jul 10, 2025 08:01 IST

    మేమేం గోల్డెన్ వీసా ఇవ్వడం లేదు..ఫేక్ న్యూస్ నమ్మకండి అంటున్న యూఏఈ

    రూ.23 లక్షలకే  గోల్డెన్ వీసా అంటూ వచ్చిన న్యూస్ అంతా ఫేక్ అని తామేమీ అలాంటిది ఇవ్వడం లేదని యూఏఈ ఏజెన్సీ తేల్చిచెప్పింది. ఈ వీసాను పొందాలంటే ప్రభుత్వ విధానాల ద్వారానే దరఖాస్తులు పెట్టుకోవాలని స్పష్టం చేసింది. 

     



  • Jul 10, 2025 08:00 IST

    ఇవాళే మూడో టెస్టు... గిల్ ముందు అదిరిపోయే రికార్డులు!

    భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ ల సిరీస్ లో  భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లు పూర్తయ్యాయి. లీడ్స్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ ను 336 పరుగుల తేడాతో భారత్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది.



  • Jul 10, 2025 08:00 IST

    ఉక్రెయిన్లపై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా!



  • Jul 10, 2025 08:00 IST

    అంతర్జాతీయ క్రికెట్ లో తీవ్ర విషాదం.. బిస్మిల్లా జాన్ షిన్వారీ కన్నుమూత!



  • Jul 10, 2025 07:59 IST

    నేడే మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0



Advertisment
Advertisment
తాజా కథనాలు