ఇదేందయ్యా ఇది.. మహిళా ఓటర్‌ కార్డుపై CM నితీశ్‌ కుమార్ ఫొటో

బిహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ఓటరు కార్డుపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌ కుమార్‌ ఫొటో ఉన్నది. ఇది చూసి ఆ మహిళ, ఆమె భర్త షాక్ అయ్యారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారు మండిపడ్డారు.

New Update
Woman Voter Card

బిహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ఓటరు కార్డుపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌ కుమార్‌ ఫొటో ఉన్నది. ఇది చూసి ఆ మహిళ, ఆమె భర్త షాక్ అయ్యారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారు మండిపడ్డారు. ఓటరు కార్డుల్లో తప్పులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ మహిళ ఓటర్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  మాధేపుర మున్సిపాలిటీకి చెందిన 30 ఏళ్ల అభిలాష కుమారి తన ఓటరు కార్డులో చిరునామా మార్పించుకున్నది. దీంతో పోస్ట్‌ ద్వారా కొత్త ఓటరు కార్డు ఆమెకు చేరింది. కొత్త ఓటరు కార్డు చూసి అభిలాష కుమారి షాక్‌ అయ్యింది. 

అందులో ఆమె పేరు, చిరునామా సరిగానే ఉన్నాయి. అయితే ఆమె ఫొటో బదులు సీఎం నితీశ్‌ కుమార్‌ ఫొటో ఉన్నది. దీంతో కంగారుపడిన అభిలాష కుమారి తన భర్తతో కలిసి బూత్ స్థాయి అధికారిని కలిసింది. ఆ ఓటరు కార్డులో సీఎం నితీశ్‌ ఫొటో గమనించిన ఆయన ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని కోరాడు. ఈ పొరపాటుపై దర్యాప్తు జరుపుతామని చెప్పాడు. మరోవైపు తన భార్య ఓటరు కార్డులో సీఎం నితీశ్‌ కుమార్‌ ఫొటో ఉండటంపై అభిలాష కుమారి భర్త చందన్‌ కుమార్‌ మండిపడ్డాడు. ప్రభుత్వం, సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు