/rtv/media/media_files/2025/06/15/0bhqCAah7fBxXQS5Nolh.jpg)
Trump
ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని అంటున్నారు అమెరికా అధ్యక్షుడు. వాణిజ్య అసమతుల్యతను నివారించడానికి టారీఫ్ లను విధించాల్సిందే అని పట్టుపట్టుకుని కూర్చొన్నారు. వరుసగా ఒక్కో దేశంపైనా సుంకాలతో దాడి చేస్తున్నారు. ఇప్పటికే భారత్, చైనా, కెనడా లాంటి దేశాలపై సుంకాలను విధించారు. వీటితో పాటూ జపాన్, కొరియాల మీద కూడా విరుచుకుపడ్డారు. అందరికీ ఆగస్టు 1 నుంచి సుంకాలు అమలు అవుతాయని...ఈ సారి గడువు పొడిగించేదే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా బ్రెజిల్ తో సహా మరో ఎనిమిది దేశాలకు టారీఫ్ లను ప్రకటించారు. 50 సుంకాలను విధిస్తున్నట్టు నోటీసులను పంపారు. దీని ప్రకారం అల్జీరియా, ఇరాక్, లిబియా మరియు శ్రీలంకపై 30%; బ్రూనై మరియు మోల్డోవాపై 25%; మరియు ఫిలిప్పీన్స్‌పై 20% సుంకాలను విధించనున్నారు. అలాగే ట్రంప్ సుంకాల పరిధిని మయన్మార్, లావోస్, దక్షిణాఫ్రికా, కజకిస్తాన్, మలేషియా, ట్యునీషియా, ఇండోనేషియా, బోస్నియా మరియు హెర్జెగోవినా, బంగ్లాదేశ్, సెర్బియా, కంబోడియా మరియు థాయిలాండ్‌లతో సహా మరో పన్నెండు దేశాలకు విస్తరించారు.
Also Read : మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి!
New media post from Donald J. Trump (TS: 09 Jul 20:17 UTC) pic.twitter.com/ae36kZf6pW
— Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) July 9, 2025
Also Read : భార్యాభర్తలుగా నిత్యా మీనన్, సేతుపతి.. 'సార్ మేడమ్' టీజర్ భలే ఉంది!
Also Read : తిరుమలను దర్శించుకున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత
చరక్రవర్తిని కాదన్నారని..
పైగా బ్రెజిల్ చక్రవర్తి జైర్ బోల్సోనారోను వద్దనందుకే ఈ సుంకాలను విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకించారు. తిరుగుబాటు నిందితుడు, మాజీ నాయకుడు జైర్ బోల్సోనారోకు మద్దతు ఇవ్వడాన్ని ట్రంప్ సమర్ధించుకున్నారు. బోల్సోనారోను "రాజకీయ హింస" బాధితుడిగా అభివర్ణించారు. లూలాను ఉద్దేశించి రాసిన లేఖలో, బోల్సోనారో పట్ల వ్యవహరించిన తీరును "అంతర్జాతీయ అవమానం"గా ట్రంప్ విమర్శించారు. దాంతో పాటూ బోల్సోనారో మీద విచారణ జరగకూడదని అన్నారు. బ్రెజిల్ ఓటింగ్ విధానం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు బోల్సోనారో పోటీ చేయకుండా నిషేధించబడినప్పటికీ, వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనే ఫేవరెట్ అని ట్రంప్ తన పోస్ట్‌లో సూచించారు.
Also Read: UAE: మేమేం గోల్డెన్ వీసా ఇవ్వడం లేదు..ఫేక్ న్యూస్ నమ్మకండి అంటున్న యూఏఈ
today-latest-news-in-telugu | trump tariffs | brazil