Plane Crash: గాల్లో ఢీకొన్న శిక్షణ విమానాలు.. భారతీయ విద్యార్థి మృతి

కెనడాలోని ఓ ఫ్లైట్ స్కూల్‌లో పైలట్‌ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తుండగా రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్‌ విద్యార్థులు మృతిచెందారు. వీరిలో ఒకరు ఇండియాకు చెందిన చెందిన యువకుడు శ్రీహరి సుఖేష్‌ (23) ఉన్నాడు.

New Update
Indian student among two killed as planes collide mid-air in Canada

Indian student among two killed as planes collide mid-air in Canada

కెనడాలోని మనిటోబాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫ్లైట్ స్కూల్‌లో పైలట్‌ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తుండగా రెండు సింగిల్ ఇంజిన్ శిక్షణ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్‌ విద్యార్థులు మృతిచెందారు. వీరిలో ఒకరు ఇండియాకు చెందిన చెందిన యువకుడు శ్రీహరి సుఖేష్‌ (23) ఉన్నాడు. ఇతడు కేరళోని కొచ్చిలో త్రిప్పునితురా ప్రాంతానికి చెందినవాడు. హార్వ్స్‌ ఎయిర్‌ పైలట్‌ ట్రైనింగ్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విమాన ప్రమాదంలో భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు టోరంటో ఉన్న భారతీయ కాన్సులేట్ జనరల్ వెల్లడించారు. బాధితుడి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నామని ఎక్స్‌లో పేర్కొన్నారు. 

Also Read: ఆ ఉద్యోగుల ఉసురు పోసుకుని.. 4 వేల కోట్లు మిగుల్చుకున్న మైక్రోసాఫ్ట్.. షాకింగ్ లెక్కలు!

ఇక వివరాల్లోకి వెళ్తే మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఆ ఇద్దరు పైలట్ విద్యార్థులు చిన్న ప్లేన్‌లతో టేకాఫ్, ల్యాండింగ్‌పై ప్రాక్టీస్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆ పైలట్ ట్రైనింగ్ స్కూల్ ప్రెసిడెంట్ ఆడమ్ పెన్నెర్ తెలిపారు. వాళ్లిద్దరూ ఒకేసమయంలో ల్యాండిగ్ చేసేందుకు ప్రయత్నించారని.. రన్‌వే నుంచి కొద్ది దూరంలో ఆ రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయని పేర్కొన్నారు. ఆ పైలట్‌ విద్యార్థులు ఒకరినొకరు చూసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు. 

Also Read: భార్య చేతిలో మరో భర్త బలి.. లవర్‌తో ఎంత దారుణంగా చంపించిందంటే..?

ఈ ప్రమాదంలో భారతీయ విద్యార్థి ఒకరు చనిపోగా.. మరో విద్యార్థి కెనడాకు చెందిన 20 ఏళ్ల సావన్న మే రాయిస్. సుఖేష్, రాయిస్ వీళ్లద్దరూ కూడా ఒకే క్లాస్. మరోవైపు ఈ ప్రమాదంపై ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్టు విచారణ చేస్తోంది. ఇదిలాఉండగా ఈ ఫ్లైట్‌ స్కూల్‌ ఏడాదికి 400 మంది పైలట్ విద్యార్థులకు శిక్షణ ఇస్తోందని ఆ స్కూల్ ప్రెసిడెంట్ ఆడమ్ పెన్నెర్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు