Mega Teacher Parent Meet 2.0: నేడే మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0

ఏపీలో నేడు 'మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0' కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాల ప్రాంగణంలో జరుగుతుంది. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు.

New Update
Mega Teacher Parent Meet 2.0

Mega Teacher Parent Meet 2.0

ఏపీలో నేడు 'మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0' జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాల ప్రాంగణంలో జరుగుతుంది. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది టీచర్లు, 1,49,92,456 మంది పేరెంట్స్ పాల్గొంటారు. ఇలా చూసుకుంటే మొత్తం 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పుట్టపర్తిలో కొత్త చెరువు స్కూల్‌లో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్నారు. 

ఇది కూడా చూడండి: Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం

ఇది కూడా చూడండి:Amit Shah: రిటైర్మెంట్ తర్వాత నేను చేసేది అదే.. అమిత్ షా కీలక ప్రకటన

విద్యార్థులు భవిష్యత్తు కోసం..

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం ఎంత అవసరమో తెలియజేయడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మీట్‌లో తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతి, వ్యక్తిగత ఎదుగుదల, పాఠశాలలో వారి ప్రవర్తన గురించి ఉపాధ్యాయులతో చర్చించవచ్చు. అలాగే పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు, సలహాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం పిల్లల భవిష్యత్తుకు పునాది వంటిదని తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్‌..ఎక్కడంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు