/rtv/media/media_files/2025/07/10/shilpa-chakraborty-2025-07-10-11-51-21.jpg)
Shilpa Chakraborty
Shilpa Chakravarthi: టీవీ నటి శిల్పా చక్రవర్తి భూవివాదంలో పోలీసులు జోక్యం పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన కేసు ఇంకా కోర్టులో నడుస్తుండగా.. ఇంజెక్షన్ ఆర్డర్ అమల్లో ఉండగా జోక్యం చేసుకోవలసిన అవసరమేంటి అని పోలీసులను ప్రశ్నించింది.
భూవివాదం
అయితే నల్గొండ జిల్లా కుర్మేడ్ గ్రామంలో శిల్పా చక్రవర్తి దంపతులు కొన్న 32 ఎకరాల భూమి గురించి కొంతకాలంగా కోర్టులో కేసు నడుస్తోంది. కేసు తేలేవరకు ఆ భూమి జోలికి ఎవరూ వెళ్లకూడదని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా పాస్ చేసింది. అయినప్పటికీ చింతపల్లి ఎస్సై రామ్మూర్తి భూమి అమ్మిన వ్యక్తితో కుమ్మక్కై వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని శిల్పా చక్రవర్తి దంపతులను ఒత్తిడి చేశాడు. దీంతో శిల్పా చక్రవర్తి, ఆమె భర్త భూవివాదం విషయంలో పోలీసులు తమను వేధిస్తున్నారంటూ కల్యాణ్ యాకయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జస్టిస్ టి. వినోద్ కుమార్ నేతృత్వంలో దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కోర్టు ఆదేశాలు ఉన్నా పోలీసులు ఇలా చేయడం తప్పు అని చెప్పింది.
ఎస్సై కి నోటీసులు
విచారణలో పిటీషనర్ల తరుపు న్యాయవాది తమ వాదనలను వినిపించారు. 2017లో మహమ్మద్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి నుంచి పిటిషనర్లు ఈ భూమిని కొనుగోలు చేశారని, అలాగే ఈ భూవివాదం విషయంలో సివిల్ కోర్టు నుంచి ఇంజంక్షన్ ఉత్తర్వులతో పాటు పోలీసు రక్షణ కూడా పొందారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
వాదోపవాదనలు విన్న న్యాయస్థానం ఈ విషయంపై ఎస్సై రామ్మూర్తికి వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. అసలు ఎందుకు ఇలా చేశారనే దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఈ కేసు గురించి పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్ ఇవ్వాలని పోలీసు శాఖను కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. అలాగే సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని హైకోర్టు గట్టిగా హెచ్చరించింది.