BREAKING: మరోసారి ఆసుపత్రికి కేసీఆర్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రికి నేడు వెళ్లనున్నారు. పరీక్షల కోసం వెళ్లనున్నట్లు సమాచారం. గతవారమే తీవ్ర జ్వరంతో కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం కాస్త మెరుగు కావడంతో పరీక్షల కోసం మళ్లీ ఆసుపత్రికి వెళ్లనున్నారు.

New Update
KCR

kcr

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రికి నేడు వెళ్లనున్నారు. పరీక్షల కోసం వెళ్లనున్నట్లు సమాచారం. గతవారమే తీవ్ర జ్వరంతో కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం కాస్త మెరుగు కావడంతో పరీక్షల కోసం మళ్లీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఐదు రోజులుగా నందినగర్‌లోనే కేసీఆర్ ఉన్నారు.

ఇది కూడా చూడండి: Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం

ఇది కూడా చూడండి:Amit Shah: రిటైర్మెంట్ తర్వాత నేను చేసేది అదే.. అమిత్ షా కీలక ప్రకటన

చెకప్‌ల కోసం..

ఇదిలా ఉండగా స్వల్ప అస్వస్థత కారణంగా యశోద ఆసుపత్రిలో గతవారం అడ్మిట్ అయ్యారు. వైద్యుల మేరకు శనివారం రోజున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆ తర్వాత సాధారణ వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని యశోద వైద్యులు నిర్థారించారు.

కాగా వైద్య పరీక్షల్లో భాగంగా ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత, మరోసారి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని యశోద వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే నేడు కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రికి చికిత్సకు వెళ్లనున్నారు.

ఇది కూడా చూడండి:Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్‌..ఎక్కడంటే?

ఇది కూడా చూడండి:Youtube: యూట్యూబర్లకు షాక్.. ఇకనుంచి ఆ వీడియోలకు డబ్బులు రావు

kcr | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | latest telangana news | CM KCR Health Updates From Yashoda Hospital | kcr-in-yashoda-hospital

Advertisment
Advertisment
తాజా కథనాలు