/rtv/media/media_files/2025/04/17/SKeb4c1k8RH6HCPjhNIy.jpg)
US Visa
ఉద్యోగ (హెచ్-1బీ), విద్యార్థి (ఎఫ్/ఎం), పర్యాటక/వ్యాపార (బీ-1, బీ2), ఎక్స్చేంజ్ (జే)...ఏదైనా వీసా అయినా సరే...అమెరికా వెళ్ళాలనుకుంటే ఇక మీదట ఎక్కువ ఫీజులు చెల్లించాల్సిందే. వచ్చే ఏడాది నుంచి ఇంటెగ్రిటీ ఫీజు కింద అదనంగా 250 డాలర్లు చెల్లించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాకు వచ్చేవారు అక్రమంగా ఉండిపోకుండా, వీసా కాలానికి మించి ఉండకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. రీసెంట్ గా అమలు చేసిన వన్ బిగ్ బ్యూటిపుల్ చట్టం కింద ఈ వీసా ఫీజులు కూడా అమలు కానున్నాయి. అంతే కాదు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ ఫీజుల్లో మార్పులు చోటు కూడా చేసుకుంటాయి.
Also Read : Shilpa Chakravarthi: భూవివాదంలో నటి శిల్పా చక్రవర్తి.. ఎస్సై కి నోటీసులు
Also Read : Anushka Shetty : ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. నా ఫస్ట్ లవ్ అతడితోనే: అనుష్క ఓపెన్
తడిసిమోపెడవనున్న వీసా ఛార్జీలు..
వీసా జారీ చేసేటప్పుడే ఈ అధిక రుసుమును అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ రుసుమును సర్‌చార్జ్ రూపంలో వసూలు చేస్తుంది. దీంతోపాటు.. ఐ-94 సర్‌చార్జ్ 24 డాలర్లు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ ఈఎస్ టీఏ- 13 డాలర్లు, ఎలక్ట్రానిక్ వీసా అప్‌డేట్ సిస్టమ్ ఈవీయూఎస్-30 డాలర్లు కింద అదనపు రుసుములను వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో పొందుపరిచారు. ఇవన్నీ కలిపి ప్రస్తుతం వీసా ఫీజులు భారంగా మారనున్నాయి. ఇప్పటి వరకు అమెరికాకు పర్యాటక/వ్యాపార వీసాపై వెళ్లాలంటే వీసా చార్జీలుగా 185 డాలర్లు వసూలు చేస్తున్నారు. అంటే దాదాపుగా రూ.15,855. బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్‌లో ప్రతిపాదించిన ఇతర చార్జీలను, ఇంటెగ్రిటీ రుసుమును కూడా కలుపుకొంటే ఇప్పుడు అది ఏకంగా 472 డాలర్లకు అంటే రూ.40,456 గా అవనుంది. ఇవి భవిష్యత్తులో మరింత పెరిగి అవకాశం ఉదని చెబుతున్నారు.
Also Read: Trump Tariffs: బ్రెజిల్ తో పాటూ 8 దేశాలపై 50 శాతం సుంకాలు
Also Read : Israel-Hamas War: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి!
today-latest-news-in-telugu | us-visa | fee | One Big Beautiful Bill