/rtv/media/media_files/2025/07/10/iaf-pilot-killed-in-jaguar-crash-became-a-father-a-month-ago-2025-07-10-14-30-02.jpg)
IAF Pilot Killed In Jaguar Crash Became A Father A Month Ago
రాజస్థాన్‌లోని చురూ జిల్లాలో బుధవారం ఓ ఫైటర్ జెట్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అయితే వీళ్లలో స్క్వాడ్రన్ లీడర్ లోకేందర్ సింగ్ అనే పైలట్ నెల రోజుల క్రితమే తండ్రయ్యాడు. జూన్ 10న ఆయన భార్య మగ శిశువుకు జన్మనిచ్చింది. నెల రోజులకే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక వివరాల్లకి వెళ్తే.. హర్యాణాకు చెందిన లోకేందర్ సింగ్ (31) 2016లో ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు.
Also Read: యెమెన్ నర్స్ నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నం..బ్లడ్ మనీ ఒక్కటే దారి
కరోనా సమయంలో ఆయనకు పెళ్లి జరిగింది. నెల రోజుల క్రితమే తండ్రి కావడంతో సెలవులపై ఇటీవల ఇంటికి వెళ్లారు. మళ్లీ జూన్ 30న విధుల్లోకి చేరారు. రోటీన్ ట్రైనింగ్ మిషన్‌లో భాగంగా బుధవారం ఫైటర్ జెట్‌లో వెళ్లాడు. కానీ ఇంతలోనే ఈ విషాద ఘటన జరిగింది. లోకేందర్ సింగ్‌కు ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. లోకేందర్ బాగా చదివేవాడని.. ఐఏఎఫ్ పైలట్ అవుతానంటూ కలలు కన్నాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ ఈ ప్రమాదం జరిగి అతడు మ-ృతిచెందడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.
Also Read: చైనా డ్యామ్..భారత్ పై వాటర్ బాంబ్..అరుణాచల్ సీఎం ఆందోళన
ఇదిలాఉండగా బుధవారం రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన IAF ఫైటర్ జెట్ మధ్యాహ్నం 1.25 గంటలకు రత్నగఢ్ ప్రాంతంలోని భానుధా అనే గ్రామంలో కుప్పకూలింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విమానం శకలాల కింద మృతదేహాలను గుర్తించారు. మృతిచెందిన మరో పైలట్ రాజస్థాన్‌కు చెందిన రిషి రాజ్‌సింగ్ (23).