Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్

అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

New Update
rains

rains

అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. నేడు కూడా తెలంగాణలో దట్టమైన మేఘాలతో మోస్తారు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం

ఏపీలో ఈ జిల్లాల్లో..

నేడు ఏపీ(Andhra Pradesh)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

ఇది కూడా చూడండి:Amit Shah: రిటైర్మెంట్ తర్వాత నేను చేసేది అదే.. అమిత్ షా కీలక ప్రకటన

తెలంగాణలో ఈ జిల్లాల్లో..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

ఇది కూడా చూడండి:Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్‌..ఎక్కడంటే?

ఇది కూడా చూడండి:Youtube: యూట్యూబర్లకు షాక్.. ఇకనుంచి ఆ వీడియోలకు డబ్బులు రావు

ap weather update today | ap weather updates | ap-weather-update | ap today weather update | Weather Update

Advertisment
Advertisment
తాజా కథనాలు