/rtv/media/media_files/2025/07/10/bowler-2025-07-10-07-37-48.jpg)
క్రికెట్ లో ఎప్పుడు చూడని ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. వైటాలిటీ టీ20 బ్లాస్ట్ 2025లో భాగంగా సోమర్‌సెట్, ఎసెక్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ పేసర్ రిలే మెరెడిత్ అద్భుతమైన యార్కర్‌తో స్టంప్‌ను సగానికి విడగొట్టాడు. వికెట్ సగానికి విరగకుండా నిలువుగా సగానికి విరగడం అందరిని షాక్ కు గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : భార్యాభర్తలుగా నిత్యా మీనన్, సేతుపతి.. 'సార్ మేడమ్' టీజర్ ఉంది!
Have you ever seen anyone split a stump down the Middle like Riley Meredith ???#ENGvINDpic.twitter.com/beLTbl5Wdy
— Saurabh Yadav (@saurabhydv676) July 10, 2025
సోమర్సెట్ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని ఎసెక్స్ ఛేజ్ చేసే క్రమంలో ఓపెనర్ మైఖేల్ పెప్పర్‌ను ఔట్ చేయడంతో ఈ సంఘటన జరిగింది. మెరెడిత్ వేసిన యార్కర్ బాల్ లెగ్-స్టంప్ లోకి దూసుకెళ్లి స్టంప్ ను రెండుగా చీల్చింది. ఇందులో ఒక సగం పాతుకుపోగా.. మరొక సగం కింద పడింది.
Also Read : తిరుమలను దర్శించుకున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత
Also Read : ట్రంప్ పై ఇరాన్ డ్రోన్ దాడి?
2025 మెగా వేలంలో
అయితే మ్యాచ్‌లో మెరెడిత్ మొత్తం ప్రదర్శన చాలా సాధారణంగా ఉంది. అతను 2 ఓవర్లు బౌలింగ్ చేసి, 22 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నాడు. మొదట మైఖేల్ పెప్పర్‌ను 13 పరుగులకు అవుట్ చేసి, తరువాత చార్లీ అల్లిన్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్ లో ఎసెక్స్‌పై సోమర్‌సెట్ 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఐపీఎల్‌లో పంజాబ్, ముంబై తరపున ఆడిన మెరెడిత్ 18 మ్యాచ్‌ల్లో 9.46 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. అయితే, 2025 మెగా వేలంలో అతన్ని ఏ జట్టు కూడా ఎంపిక చేయలేదు.
Also Read : మంత్రి ఉత్తమ్కు బిగ్ షాక్ .. నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
cricket | sports | england | australian | Taunton