నలుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసిన గుజరాత్ ప్రభుత్వం

గుజరాత్‌ వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇందులో నిర్లక్ష్యం వహించిన నలుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. రాష్ట్ర రోడ్లు, భవనాల విభాగానికి చెందిన నలుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేశారు.

New Update
bridge-collopse

గుజరాత్‌ వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో 16 మంది మృతి చెందారు. ఇందులో నిర్లక్ష్యం వహించిన నలుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. రాష్ట్ర రోడ్లు, భవనాల విభాగానికి చెందిన నలుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేశారు.

అకస్మాత్తుగా వంతెన  కూలిపోవడంతో వాహనాలు, ప్రయాణికులు నదిలో పడిపోయారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి పలువురు కాపాడారు. వడోదర - ఆనంద్ జిల్లాలను కలుపుతూ గంభీర బ్రిడ్జి నిర్మించారు.  ఇప్పుడు  బ్రిడ్జి కూలడంతో ఆనంద్, వడోదర, భారూచ్, అంకాళేశ్వర్ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.   రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా వాహనాలు నదిలో పడిపోయాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు