/rtv/media/media_files/2025/07/10/microsoft-2025-07-10-16-03-36.jpg)
Microsoft Reveals $500 Million AI Savings, Days After 9,000 Layoffs
ఇటీవల ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. దాదాపు 9 వేల మందికి పైగా లేఆఫ్ నోటీసులు పంపించింది. తమ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగాన్ని పెంచిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా మైక్రోసాఫ్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది తమ కంపెనీ ఏఐ వల్ల రూ.4 వేల కోట్లు ఆదా చేసినట్లు పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ చీఫ్ కమర్షియల్ అధికారి జడ్సన్ ఆల్తోఫ్ ఈ అంశంపై మాట్లాడారు. కాల్ సెంటర్ వ్యవహారాల్లో ఏఐని వాడటం వల్ల గత ఏడాది 500 మిలియన్ డాలర్లు (రూ.4,285 కోట్లు) ఆదా అయ్యాయని తెలిపారు. డబ్బులు ఆదా కావడంతో పాటు అంతర్గత సామర్థ్యం పెరిగిందని.. తమ కస్టమర్లకు కూడా మెరుగైన సేవలు అందాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. మైక్రోసాఫ్ట్ ఇటీవల తమ కంపెనీలో 4 శాతం మందిని అంటే 9100 మందిని తొలగిస్తున్నట్లు పేర్కొంది.
Also Read: ఛీ.. మీరేం మనుషులురా.. ఆరేళ్ల చిన్నారితో 45ఏళ్ల వ్యక్తి ఏం చేశారంటే..?
ఎక్స్‌బాక్స్, గేమింగ్ డివిజన్లలో ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ లేఆఫ్‌లు ప్రకటించడం ఇది నాలుగోసారి. ఈ ఏడాది ప్రారంభంలో ముందుగా 1 శాతం మందిని తొలగించింది. ఆ తర్వాత మే నెలలో 6 వేల మందిని, జూన్‌లో 300 మందికి పైగా ఉద్యోగులను తీసేసింది. జాబ్స్ కోల్పోయినవారిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డెవలపర్లు ఉన్నారు. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే లేఆఫ్‌లు ఇస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటన చేసింది.
దీంతో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకి ఆ కంపెనీలోని ఎక్స్‌బాక్స్ గేమ్ స్టూడియోస్‌లో పనిచేసే ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ ఒకరు సలహా ఇవ్వడం ఇటీవల చర్చనీయాంశమైంది. '' ఇది చాలా కష్టమైన సమయం. ఈ లేఆఫ్‌లు మీరు ఎదుర్కోవాలన్నా, వాటి నుంచి బయటపడి ముందుకెళ్లాలన్నా మీరు ఒంటరిగా లేరనే విషయం మరవకండి. మరింత స్పష్టతతో కేరీర్‌లో ముందుకు సాగేందుకు మీరు ఏఐ టూల్స్ వాడొచ్చు. అవి మానసిక బాధ నుంచి రిలీఫ్ కలిగిస్తాయి. మీ రెజ్యూమెను మరింత మెరుగ్గా తయారుచేసేందుకు సాయపడతాయని'' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్ టర్నబుల్ తన లింక్ట్‌ఇన్‌లో పోస్టు చేశారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది.
Also Read: భార్య చేతిలో మరో భర్త బలి.. లవర్‌తో ఎంత దారుణంగా చంపించిందంటే..?