/rtv/media/media_files/2025/07/10/cm-siddaramaiah-2025-07-10-15-16-13.jpg)
CM Siddaramaiah
Karnataka:
కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. తానే ఐదేళ్లు సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. డీకే శివకుమార్(DK Shivakumar)ను సీఎం చేయడం కోసం తనను హైకమాండ్ రాజీనామా చేయాలని కోరిందన్న ప్రచారం కూడా పూర్తిగా అవాస్తవమన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read:హైదరాబాద్‌లో విషాదం... సైబర్ నేరగాళ్ల మోసానికి ఏపీ మహిళ ఆత్మహత్య
''ఐదేళ్లు నేనే సీఎంగా ఉంటాను. ఎప్పుడో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాను. జులై 2న కూడా దీనిపై ప్రకటన విడుదల చేశాను. ఆ సమయంలో డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కూడా సీఎం పదవికి పోటీదారుడే. అందులో తప్పేముంది. ఇప్పుడు కుర్చీ ఖాళీగా లేదని ఆయనే చెప్పారు. నాయకత్వ రొటేషన్‌పై పార్టీ హైకమాండ్ ఎలాంటి సూచనలు చేయలేదు. రెండున్నరేళ్ల తర్వాత సీఎం మార్పు అంశాన్ని ఎవరూ నిర్ణయించలేదు.
Also Read: బ్రెజిల్‌తో ట్రంప్ కొత్త పంచాయితీ.. ఆ విచారణ ఆపేయాలంటూ వార్నింగ్
హైకమాండ్ దీనిపై ఏమైనా నిర్ణయం తీసుకుంటే తమకు చెబుతుంది. దాని మేము అమలు చేస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. నిధులు కొరత అనేది లేదు. తగినని నిల్వలు ఉన్నాయి. ఒకట్రెండు ఇబ్బందులు ఉండొచ్చు. దానికే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసినట్లు కాదు. కేంద్రం దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోంది. కాంగ్రెస్ నేతలనే ఈడీ టార్గెట్ చేస్తోందని'' సిద్ధరామయ్య అన్నారు. ఇదిలాఉండగా కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాకా.. డీకే శివకుమార్, సిద్ధరామయ్య సీఎం పదవికి పోటీ పడ్డ సంగతి తెలిసిందే. చివరికీ హైకమాండ్ సీనియారిటీ పరంగా సిద్ధరామయ్యకే బాధ్యతలు అప్పగించింది.
Also Read: నెల రోజుల క్రితమే తండ్రయ్యాడు.. అంతంలోనే విమాన ప్రమాదంలో మృతి
ఆ సమయంలో రెండున్నరేళ్ల తర్వాత డీకే శివకుమార్ సీఎం అవుతారంటూ కూడా ప్రచారం నడిచింది. అయితే ఇటీవల అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు మరో రెండు, మూడు నెలల్లో డీకే శివకుమార్ సీఎం అవుతారని ఓ సభలో వ్యాఖ్యానించారు. దీంతో ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. డీకే శివకుమార్ కూడా దీనిపై స్పందించారు. ప్రజలు తనను సీఎం కావాలని కోరుకుంటున్నారని అందులో తప్పేమి లేదన్నారు. కానీ సీఎం మార్పు గురించి పార్టీలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య ఐదేళ్ల తానే సీఎం అని క్లారిటీ ఇచ్చేశారు.