Rambabu : టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రివ్యూ చూస్తుండగా బ్రెయిన్‌ స్ట్రోక్‌.. దర్శకుడు మృతి!

డైరెక్టర్ సండ్రు నగేష్‌ అలియాస్‌ రాంబాబు(47)  బ్రెయిన్‌ స్ట్రోక్‌ తో కన్నుమూశారు.  తాను దర్శకత్వం వహించిన బ్రహ్మాండ రిలీజ్ కు దగ్గరలో ఉండటంతో ప్రివ్యూ చూస్తూ  బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై  ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

New Update
amani-director

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యంగ్ డైరెక్టర్ సండ్రు నగేష్‌ అలియాస్‌ రాంబాబు(47)  బ్రెయిన్‌ స్ట్రోక్‌ తో కన్నుమూశారు.  తాను దర్శకత్వం వహించిన బ్రహ్మాండ రిలీజ్ కు దగ్గరలో ఉండటంతో ప్రసాద్‌ ల్యాబ్‌లో  ప్రివ్యూ చూస్తూ  బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై  ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన తొలి సినిమా ప్రివ్యూ చూస్తూ హఠాన్మరణ చెందడం అనేది అందరికీ షాక్ గురిచేసింది. ఆయన ఈఅంత్యక్రియులు బుధవారం ఆయన స్వగ్రామం మెదక్ లోని  అల్లీపూర్ లో జరిగాయి. ఆయనకు భార్య సరిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  

Also Read :  Delhi Earthquake : దేశ రాజధానిలో భారీ భూకంపం.. వణికిన ఢిల్లీ

Also Read :  ఇక ఉద్యోగాలు చేయలేమంటున్న నాసా ఉద్యోగులు..ట్రంప్ వల్లే..

సినీ ప్రముఖుల సంతాపం

నగేష్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నగేష్‌ 150 సినిమాలకు, 60 సీరియళ్లకు కో-డైరెక్టర్‌గా, కొన్నింటికి దర్శకుడిగా పనిచేశారు. ఈటీవీలో ప్రసారమైన అంతరంగాలు, అన్వేషణ సీరియళ్లకు కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇక  నగేష్‌ తెరకెక్కించిన  బ్రహ్మాండ సినిమా విషయానికి వస్తే..  తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గుకథ నేపథ్యంలో తెరకెక్కింది. ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇదే. 

 ఆమని, జయరామ్, కనిక వాద్య, జోగిని శ్యామల, విజయ రంగరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదల కావాల్సి ఉంది.ఈ క్రమంలో దర్శకుడు మృతి చెందడం చిత్ర యూనిట్ ను శోకసంద్రంలోకి నెట్టేసింది.  

Also Read :  ఎంతకు తెగించావ్రా ప్రిన్సిపాల్.. పీరియడ్స్‌లో ఉన్నారో లేదో చెక్‌ చేయడానికి బాలికల బట్టలిప్పి!

Also Read :  యూఎస్ వెళ్లాలనుకునే వారికి బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం!

telugu-cinema | tollywood | director | rambabu | latest-telugu-news | today-news-in-telugu | telugu-news | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
తాజా కథనాలు