🔴Live Breakings: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Jun 28, 2025 20:59 IST

    Travis Head: ప్రపంచ రికార్డు సృష్టించిన ట్రావిస్ హెడ్

    ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ ట్రావిస్ హెడ్‌ రికార్డు నెలకొల్పాడు. WTCలో 10 ఫ్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

     

    Travis Head
    Travis Head

     



  • Jun 28, 2025 20:38 IST

    PM Modi - Shubhanshu Shukla: ISSలో శుభాంశు శుక్లా.. వీడియో కాల్‌ మాట్లాడిన ప్రధాని మోదీ..

    ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోహగామిగా శుభంశు శుక్లా చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ శనివారం ఆయనతో వీడియోల్‌ కాల్‌లో మాట్లాడారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణను ప్రధాని ఎక్స్‌లో షేర్ చేశారు.

     

    M Modi interacts with Indian astronaut Shubhanshu Shukla
    M Modi interacts with Indian astronaut Shubhanshu Shukla

     



  • Jun 28, 2025 19:18 IST

    Smart Traffic System: త్వరలోనే డిజిటల్ హైవే.. రూల్స్ అతిక్రమిస్తే జేబులకి చిల్లే!

    ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ముందుగా ఢిల్లీ-గురుగ్రామ్‌ను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై డిజిటల్ హైవే తీసుకోచ్చారు. దేశ వ్యాప్తంగా డిజిటల్ హైవేను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

    National highway



  • Jun 28, 2025 19:18 IST

    Reba Monica John: చీరలో మెరిసిపోతున్న రెబా మోనికా.. ఫొటోలు చూశారా!

    ఇటీవల రెబా మోనికా జాన్ మ్యాడ్ స్క్వేర్ మూవీలో స్వాతి రెడ్డి అనే స్పెషల్ సాంగ్ చేసింది. అయితే సోషల్ మీడియాలో తాజాగా శారీలో మెరిసిపోతున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    Reba Monica John



  • Jun 28, 2025 19:17 IST

    Kannappa Movie First Day Collections: కన్నప్ప ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

    మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీ ఇటీవల విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. జూన్ 27వ తేదీ న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 18-20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది.

     

    kannappa highlight scene
    kannappa highlight scene

     



  • Jun 28, 2025 19:17 IST

    Mahaa News: మమ్మల్ని చంపేస్తారా.. దాడిపై తీవ్రంగా స్పందించిన ఎండీ వంశీ!

    హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్‌ఎస్ దాడి చేయడంతో ఎండీ వంశీ తీవ్రంగా స్పందించారు. పెద్ద బండరాయలతో కార్లు మీద దాడి చేశారని తీవ్రంగా మండిపడ్డారు. మమ్మల్ని చంపేస్తారా? అంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలపై ఎండీ వంశీ మండి పడ్డారు.

    MD Vamsi



  • Jun 28, 2025 14:28 IST

    Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు

    పశ్చిమ్‌ బెంగాల్‌ లో వరుసగా అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తనపై ఓ వ్యక్తి అనేకసార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపణలు చేస్తోంది. ఆ వ్యక్తి ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న స్వామీ ప్రదీప్తానంద (కార్తిక మహారాజ్‌) అంటూ ఆరోపించడం కలకలం రేపింది.

    Padma awardee accused of rape



  • Jun 28, 2025 14:01 IST

    గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!

    బాలీవుడ్ నటి షెఫాలి జరివాలా గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షెఫాలీ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. దీంతో ఆమె మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

     

    Shefali Jariwala
    Shefali Jariwala

     



  • Jun 28, 2025 13:50 IST

    దూకుడు పెంచిన కవిత..నిన్న కేంద్రమంత్రి, నేడు సీపీఐ ఎంపీతో భేటీ

    తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్‌ కలిపించాలని డిమాండ్‌  చేస్తూ జులై 17 రైల్‌ రోకోకు పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన దూకుడును మరింత పెంచారు. ఉద్యమానికి వివిధ పార్టీల మద్ధతు కూడకడుతున్నారు.

    Kalvakuntla Kavitha



  • Jun 28, 2025 12:55 IST

    హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి పీజేఆర్‌ ఫ్లైఓవర్

    హైదరాబాద్ నగరంలో  ట్రాఫిక్‌ సమస్యను తగ్గించడానికి మరో ప్లై ఓవర్‌ అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్‌ వరకు నిర్మించిన పి. జనార్ధన్ రెడ్డి ( శిల్పా లే ఔట్ రెండో ఫేస్) ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఈ రోజు ప్రారంభించనున్నారు.

    PJR flyover



  • Jun 28, 2025 12:53 IST

    ఇజ్రాయిల్ ప్రధాని ప్లాన్ ఇదే.. యుద్ధాలతో ప్రజల్ని మార్చుతున్న నెతన్యాహు

    ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నెతన్యాహుకు కలిసివచ్చింది. ఈ యుద్ధం ఆయన పొటిటికల్ లైఫ్‌లైన్ అని కొందరు అభిప్రాయపడుతున్నాయి. ఇజ్రాయిల్‌లో నెల రోజుల క్రితం పరిస్థితిలో వేరాలా ఉండేది. ప్రధాని బెంజమిన్ నెతాన్యహుపై ప్రజల్లో విపరీతమైన వివక్ష ఉండేది.

     

    Israel PM Netanyahu
    Israel PM Netanyahu

     



  • Jun 28, 2025 12:35 IST

    కన్నీళ్లు పెట్టిస్తున్న యాంకర్ స్వేచ్ఛ కూతురి మాటలు..

    యాంకర్ స్వేచ్ఛ మృతిపై తన కూతురు కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లి చనిపోవడానికి పూర్ణచందరే కారణమని తెలిపింది. వాన్ని నమ్మి తన తల్లి మోసపోయిందని కన్నీరు పెట్టుకుంది. వాడు మంచివాడు కాదని తనకు అనిపించిందని.. వద్దమ్మా అని చెప్పినా అమ్మ వినలేదు అని చెప్పింది.

     

    Anchor Swetcha Daughter Crying
    Anchor Swetcha Daughter Crying

     



  • Jun 28, 2025 11:40 IST

    కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. కోల్‌కతా రేప్ కేసులో షాకింగ్ విషయాలు

    వెస్ట్ బెంగాల్ కోల్‌కతాలోని లా కాలేజీ విద్యార్థిని సామూహిక అత్యాచార ఘనటలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, కాళ్లు పట్టుకుంటానని వేడుకున్నా ఆ కీచకుడు ఆమెను వదల్లేదని బాధితురాలు పోలీసులు ఫిర్యాదులో పేర్కొంది.

    law college gang rape



  • Jun 28, 2025 11:40 IST

    వరంగల్‌లో దారుణం... కన్నతల్లిని పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కొడుకు

    వరంగల్‌ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుమారుడే కన్నతల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన వినోద కు ఆమె కొడుకు సతీష్‌తో ఆస్తి గొడవుల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    Son pours petrol on his mother and sets her on fire



  • Jun 28, 2025 11:00 IST

    తాజ్ మహల్‌కు పగుళ్లు.. డేంజర్ జోన్‌లో ప్రేమ చిహ్నం

    ప్రేమికుల చిహ్నం తాజ్ మహల్‌ డేంజర్ జోన్ ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్‌కు పగుళ్లు వస్తున్నాయి. వరల్డ్ టూరిస్ట్ ప్లేస్‌గా ఉన్న ఆగ్రాలోని తాజ్‌మహల్‌లో వర్షపు నీరు లీకవుతోంది.

    Taj Mahal



  • Jun 28, 2025 09:46 IST

    స్వేచ్ఛ తండ్రి షాకింగ్ విషయాలు.. తండ్రికి ఫోన్ చేసి ఏం చెప్పిందంటే..?

    తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య సంచలనంగా మారింది. శుక్రవారం రాత్రి ఆమె చిక్కడపల్లిలోని ఆమె నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ బలవన్మరణానికి పూర్ణచందరే కారణం ఆమె తండ్రి చెబుతున్నాడు.

    Anchor Swechcha



  • Jun 28, 2025 09:46 IST

    జపాన్‌లో ‘ట్విటర్‌ కిల్లర్‌’ కు ఉరి

    జపాన్‌ రాజధాని టోక్యోలో ట్విటర్‌ కిల్లర్‌గా సంచలనం సృష్టించిన తకహిరో షిరాయిషికి అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. అతను ట్విట్టర్‌లో పరిచయమైన బాలికలను, మహిళలకు నమ్మించి.. మాయమాటలు చెప్పి లైంగికదాడి చేసి 9 మందిని చంపినట్లు తేలింది.

    witter Killer hanged in Japan



  • Jun 28, 2025 08:17 IST

    టీటీడీలో కలకలం..శ్రీ శ్రీనివాస కళార్చన పేరిట మోసం… టీటీడీ విజిలెన్స్ అదుపులో నిర్వాహకుడు ?

    తిరుమలలో నృత్యకళాకారులతో  కళార్చన, అరంగేట్రం కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ ఒక నిర్వాహకుడు కళాకారుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలో ‘శ్రీ శ్రీనివాస కళార్చన’ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పి కళాకారులను మోసగించాడు.

    Sri Srinivasa Kalarchana Fraud



  • Jun 28, 2025 08:16 IST

    తమిళనాడులో పట్టాలు తప్పిన ప్యాసింజర్‌ రైలు

    తమిళనాడులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాణిపేట్ జిల్లాలో అరక్కోణం-కాట్పాడి మెము ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ట్రైన్ వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి భారీ ప్రమాదం జరగలేదు.

    Ranipet District



  • Jun 28, 2025 08:15 IST

    మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

    యూపీలోని మహోబా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ PUBG గేమ్‌ ఆడుతూ పంజాబ్‌కు చెందిన యువకుడితో ప్రేమలో పడింది. తన ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలుగా నరుకుతానని భర్తను బెదిరించింది. భయపడిన ఆ భర్త తన భార్యను ఆమె ప్రేమించిన ప్రియుడితో వెళ్ళనిచ్చాడు.

     

    Pubg Wife
    Pubg Wife

     



  • Jun 28, 2025 08:00 IST

    ఎయిర్ ఇండియాలో నలుగురు ఉద్యోగులు సస్పెండ్

    అహ్మదాబాద్‌ విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్‌ ప్రపంచాన్ని కలచివేసింది. ఈ విషాద ఘటన నుంచి తేరుకోక ముందే 10 రోజుల్లోనే ఎయిరిండియా గ్రౌండ్‌ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది.

    Air India employees party



  • Jun 28, 2025 07:43 IST

    కోహ్లీ జెర్సీలో చితకబాదిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్‌ చిత్తు చిత్తు

    ఇంగ్లాండ్ అండర్ 19తో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో అత్యధికంగా 48 పరుగులు చేశాడు.

     

     



  • Jun 28, 2025 07:22 IST

    పూరీ జగన్నాథ్ రథయాత్రలో 500 మంది భక్తులకు గాయాలు

    ఒడిశాలోని పూరీలో జగన్నాథ్ రథయాత్ర ఉత్సవంలో అపశృతి చేసుకుంది. దాదాపు 500 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. మూడు రథాలను లాగడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పూరీలో రథాలను లాగుతున్న సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. 

    Puri Rath Yatra (1)

     

     



  • Jun 28, 2025 07:21 IST

    తెలుగు యాంకర్ సూసైడ్.. వెలుగులోకి సంచలన విషయాలు!

    ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్క(40) ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. పలు తెలుగు న్యూస్ ఛానళ్లలో ఆమె దాదాపు 18ఏళ్ల పని చేసిన అనుభవం ఉంది.

    anchor

     



  • Jun 28, 2025 07:20 IST

    గుండెపోటుతో బిగ్ బాస్ ఫేమ్.. ప్రముఖ నటి మృతి

    ప్రముఖ నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) కన్నుమూశారు. నిన్న (శుక్రవారం) రాత్రి ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ వార్తతో సినీ పరిశ్రమతో పాటు ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

     

    Shefali Jariwala passes away
    Shefali Jariwala passes away

     



Advertisment
Advertisment
తాజా కథనాలు