Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని ప్లాన్ ఇదే.. యుద్ధాలతో ప్రజల్ని మార్చుతున్న నెతన్యాహు

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నెతన్యాహుకు కలిసివచ్చింది. ఈ యుద్ధం ఆయన పొటిటికల్ లైఫ్‌లైన్ అని కొందరు అభిప్రాయపడుతున్నాయి. ఇజ్రాయిల్‌లో నెల రోజుల క్రితం పరిస్థితిలో వేరాలా ఉండేది. ప్రధాని బెంజమిన్ నెతాన్యహుపై ప్రజల్లో విపరీతమైన వివక్ష ఉండేది.

New Update
Israel PM Netanyahu

Israel PM Netanyahu

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నెతన్యాహుకు కలిసివచ్చింది. ఈ యుద్ధం ఆయన పొటిటికల్ లైఫ్‌లైన్ అని కొందరు రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నాయి. ఇజ్రాయిల్‌లో నెల రోజుల క్రితం పరిస్థితిలో వేరాలా ఉండేది. ప్రధాని బెంజమిన్ నెతాన్యహుపై ప్రజల్లో విపరీతమైన వివక్ష ఉండేది. ఆయన సుదీర్ఘకాలంగా పదవిలో ఉండటం వల్ల నెతన్యాహు పాలనకు వ్యతిరేకతం పెరిగిపోయింది. అంతేకాదు ఆయనపై పలు అవినీతి ఆరోపణ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే పొరుగు దేశాలతో యుద్ధానికి దిగుతున్నారని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు చెబుతున్నారు. 

రాజకీయ భవిష్యత్ కోసం యుద్ధాలకు

ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుపై ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌పై దాడితో సంతృప్తి చెందారని, ప్రధాన మంత్రి నెతన్యాహుపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇజ్రాయిల్ దేశస్థులు. యుద్ధం పేరు చెప్పి సొంత దేశ ప్రజల మనసు మళ్లిస్తున్నారని నెతన్యాహుపై ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి ఆయన తీరు కూడా అలాగే ఉంది. దాదాపు మూడు క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కుంటున్న ఆయన ఇప్పుడు ప్రజలకు దగ్గరైయ్యారు. ఇజ్రాయెల్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి, రాజకీయ సంక్షోభాలను తారుమారు చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి నెతన్యాహు. గాజాలో యుద్ధాన్ని నిర్వహించడం, మిగిలిన బందీలను విడుదల చేయడానికి హమాస్‌తో ఒప్పందానికి నిరాకరించడంపై ఆయనపై దేశీయ, అంతర్జాతీయ విమర్శలు పెరుగాయి. 

నెతన్యాహు సుదీర్ఘ పాలపై ప్రజల్లో వ్యతిరేకత

ప్రజలపై నిర్భందాలు, ఆంక్షలు, పొరుగు దేశాలతో యుద్ధాల కారణంగా ఇజ్రాయిల్ పౌరులు విసిగి పోయారు.  గాజా స్ట్రిప్‌లో యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)లో నెతన్యాహు విచారణ ఎదుర్కొంటున్నారు. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌లో హమాస్ దాడి వైఫల్యాలకు దేశీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. అలాగే దీర్ఘకాల అవినీతి విచారణలో నిర్ణయాత్మక దశకు చేరుకుంటున్నాడు. ఈక్రమంలో ఆయన వైపు ప్రజల్ని తిప్పుకోడానికి ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని జూన్ 13న యుద్ధం లేవనెత్తాడు. ప్రతిపక్షంలోని చాలా మందితో సహా ఇజ్రాయెల్ ప్రజలు ఇరాన్‌పై సైనిక దాడికి మద్దతు ఇస్తారని నెతన్యాహుకి బాగా తెలుసు. ఇరాన్‌తో యుద్ధం అతనికి రాజకీయాల్లో కలిసి వస్తుందని ఆలోచించాడు. 

నెతన్యాహుపై ఉన్న అవినీతి కేసులు

ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుపై మూడు వేర్వేరు కేసుల్లో విచారణ జరుగుతుంది. చీటింగ్, నమ్మక ద్రోహం, లంచాలు తీసుకోవడం వంటి అభియోగాలు మోపబడ్డాయి. ఓ బిలియనీర్, హాలీవుడ్ నిర్మాతకు  వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలు చేర్చడానికి 10వేల డాలర్ల విలువైన సిగార్లు, షాంపైన్ తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. నెతన్యాహు విచారణ మే 2020లో ప్రారంభమైనప్పటి చాలాసార్లు ఆలస్యం అయింది. గాజాలో యుద్ధం, తరువాత లెబనాన్‌లో వివాదం కారణంగా ప్రధానమంత్రి విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ కు నెతన్యాహును క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది. కానీ క్షమాపణ ప్రస్తుతం చర్చనీయాంశం కాదని ఇజ్రాయిల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

ఇజ్రాయిల్‌లో 2026 ఎన్నికలు

2026లో బెంజ్‌మిన్ నెతన్యాహు ప్రభుత్వం పదవి కాలం పూర్తి అవుతుంది. ఇరవై ఆరవ నెస్సెట్‌లోని 120 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2026 అక్టోబర్ 27 నాటికి ఇజ్రాయెల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి ఆయన ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశ్యంతోనే మొన్నటి వరకు ఇరాన్‌తో యుద్ధం చేశాడు. అంతకు ముందు గాజాలో హమాస్‌పై దాడులు, ప్రస్తుతం లెబనాన్‌పై దాడు చేస్తున్నాడు. ఈ యుద్ధాలు నెతన్యాహు ప్రజాదరణకు స్వల్పకాలిక ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. నెతన్యాహు ముందస్తు ఎన్నిలకు పోయేందుకు చూస్తున్నాడని ఇజ్రాయెల్ మీడియా చెబుతుంది. మారివ్ వార్తాపత్రిక శుక్రవారం నిర్వహించిన ఒక పోల్‌లో యుద్ధం నెతన్యాహు లికుడ్ పార్టీకి మద్దతును పెంచిందని, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇది సరిపోదని తేలింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు