/rtv/media/media_files/2025/06/28/padma-awardee-accused-of-rape-2025-06-28-14-06-18.jpg)
Padma awardee accused of rape
Sexual Harassment : పశ్చిమ్ బెంగాల్ లో వరుసగా అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాపశ్చిమ్ బెంగాల్ లో వరుసగా అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.యి. వరుసగా చోటు చేసుకుంటున్న అత్యాచారాలతో కోల్‌కత్ దేశవ్యాప్తంగా హాట్‌నగర్‌గా మారింది. ఇటీవల కోలకతాలోని ఆర్జీకర్‌లో వైద్యురాలి హత్యాచార ఘటన మరువకముందే.. తాజాగా న్యాయవిద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు గురి చేసింది. ఇదిలా ఉండగానే మరో అత్యాచార ఘటన మరింత సంచలనంగా మారింది. తనపై ఓ వ్యక్తి అనేకసార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపణలు చేస్తోంది. అయితే తనపై అత్యాచారం చేసింది ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న స్వామీ ప్రదీప్తానంద (కార్తిక మహారాజ్) అంటూ ఆరోపించడం సర్వత్రా చర్చనీయంశమైంది.
Also Read: Law student gang rape: కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. కోల్‌కతా రేప్ కేసులో షాకింగ్ విషయాలు
2012లో చనక్ ఆదివాసీ అబాసిక్ బాలికా విద్యాలయంలో తను ఉద్యోగం కోసం ప్రదీప్తానందను కలిశానని ఆమె వివరించింది. ఆయన తనకు ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారని తెలిపింది. అందులో భాగంగా 2013లో ఉద్యోగం తర్వాత ఇస్తామని చెప్పి ఆ పాఠశాలలోనే తనకు ఓ హాస్టల్‌లో వసతి కల్పించారని వివరించింది. ఆ సమయంలో తనపై పలుమార్లు ఆయన బలత్కారం చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాను గర్భం దాల్చానని తెలిపింది. ఆ సమయంలో పాఠశాల సిబ్బంది తనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి బలవంతంగా అబార్షన్ చేయించారన్నారు. ఆ తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వలేదని పైగా ఈక్రమంలో అనేకసార్లు లైంగిక దాడులకు పాల్పడినట్లు వెల్లడించారు.
Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!
ఇటీవల ప్రదీప్తానందను కలిసేందుకు ప్రయత్నించినట్లు ఆమె తెలిపారు. అలా చేసినందుకు తనను ఆయన అనుచరులు బెదిరించారని, ప్రదీప్తానందను కలిసే ఆలోచన వదులుకోవాలని హెచ్చరించారని ఆరోపించింది. ఇక, మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై ప్రదీప్తానంద స్పందిస్తూ.. ఈ ఆరోపణలను ఖండించారు. ‘కాలం అన్నింటినీ బయటపెడుతుంది. నా పేరు, ప్రతిష్ఠలను చెడగొట్టడానికి చేసిన కుట్ర ఇది. మా ఆశ్రమంలో చాలామంది మహిళలు పనిచేస్తున్నారు. మహిళా శిష్యులు కూడా ఉన్నారు. ఇక్కడున్న వారందరినీ అడగండి. మహిళలను మేము మాతృ సమానంగా గౌరవిస్తాం’ అని ఆయన ఓ వార్తా సంస్థతో పేర్కొనడం గమనార్హం.
Also Read: కోల్‌కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు