/rtv/media/media_files/2025/06/28/witter-killer-hanged-in-japan-2025-06-28-09-42-06.jpg)
witter Killer' hanged in Japan
Twitter Killer : సోషల్‌మీడియా వేదిక ట్విట్టర్‌లో పరిచయమైన బాలికలను, మహిళలకు నమ్మించి.. మాయమాటలు చెప్పి లైంగికదాడి చేసి 9 మదిని చంపిన నేరస్తుడిని ఉరితీశారు. జపాన్ రాజధాని టోక్యోలో ట్విటర్ కిల్లర్‌గా సంచలనం సృష్టించిన తకహిరో షిరాయిషికి అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. తకహిరో షిరాయిషి ట్విట్టర్ లో పరిచయం అయినవారిని తన అపార్టుమెంట్‌కు రప్పించుకుని లైంగికదాడికి పాల్పడేవాడు. ఆపై డబ్బు, ఇతర విలువైన వస్తువులు లాక్కుని.. అనంతరం చంపేసి వారి తల, మొండెం, కాళ్లు, చేతులు.. శరీర భాగాలన్నీ ముక్కలుగా నరికిపడేసేవాడు. ఈ ఘటన 2017లో కలకలం సృష్టించింది.
Also Read : గుండెపోటుతో బిగ్ బాస్ ఫేమ్.. ప్రముఖ నటి మృతి
Twitter Killer In Japan
కాగా ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి, వారిని తన అపార్ట్‌మెంట్‌కు రప్పించి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. తాను చంపిన 9 మంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు వివిధ సందర్భాలలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని గమనించి, ట్విటర్ ద్వారా వారిని సంప్రదించానని నిందితుడు తెలిపాడు. వారు చనిపోవడానికి తాను సహాయం చేశానని చెప్పడం గమనార్హం.
Also Read : Constable Kanakam web Series: కానిస్టేబుల్ కనకంగా అదరగొట్టిన వర్ష బొల్లమ్మ.. !
2017 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య, అతను 15–26 ఏళ్ల వయసున్న 8 మంది యువతులు, ఒక యువకుడిని హతమార్చాడు.హత్య చేసిన తర్వాత, శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లలో దాచేవాడు. అతని అపార్ట్‌మెంట్‌లో 9 తలలు, చేతులు, కాళ్ల ఎముకలు లభించాయి. కేసు దర్యాప్తు అనంతరం 2020లో షిరైషికి మరణశిక్ష ఖరారు చేశారు. అయితే జపాన్‌లో మరణశిక్షలను రద్దు చేయాలని అక్కడి ప్రజలు నిరసనలు చేపట్టడంతో మూడేళ్లుగా ఉరిశిక్షల అమలును నిలిపివేశారు. తాజాగా టోక్యో డిటెన్షన్ హౌస్‌లో షిరైషిని ఉరితీసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : కోహ్లీ జెర్సీలో చితకబాదిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
Also Read : ‘నా భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు మంగళసూత్రాన్ని తీయను’