Travis Head: ప్రపంచ రికార్డు సృష్టించిన ట్రావిస్ హెడ్

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ ట్రావిస్ హెడ్‌ రికార్డు నెలకొల్పాడు. WTCలో 10 ఫ్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

New Update
Travis Head

Travis Head

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ ట్రావిస్ హెడ్‌ రికార్డు నెలకొల్పాడు. WTCలో 10 ఫ్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 50 మ్యాచ్‌ల్లోనే హెడ్‌ ఈ ఘనత సాధించడం విశేషం.  వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో హెడ్‌ ఈ రికార్డు సాధించాడు. బార్బడోస్‌ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.  

Also Read: కోహ్లీ జెర్సీలో చితకబాదిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్‌ చిత్తు చిత్తు

రెండు ఇన్నింగ్స్‌లో కూడా ట్రావిస్‌ హెడ్‌ రెండు హాఫ్‌ సెంచరీలు (59,61) చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమైనప్పటి నుంచి హెడ్‌ తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్నాడు. నిలకడగా రాణిస్తూ ఆస్ట్రేలియా జట్టుకు కీలక బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా WTCలో 50 మ్యాచ్‌లు ఆడి 3233 పరుగులు తీశాడు. 

Also Read: ఇజ్రాయిల్ ప్రధాని ప్లాన్ ఇదే.. యుద్ధాలతో ప్రజల్ని మార్చుతున్న నెతన్యాహు

అత్యధిక రన్స్‌ చేసిన ఆటగాళ్ల లిస్ట్‌లో హెడ్‌ ఇప్పుడు ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఇక WTC చరిత్రలో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు అందుకున్న వాళ్లలో హెడ్‌ తర్వాత ఇంగ్లాండ్‌ బ్యాటర్లు బెన్‌స్టోక్స్‌, జో రూట్‌ ఉన్నారు. వీళ్లిద్దరూ కూడా చెరో ఐదుసార్లు అవార్డులు తీసుకున్నారు. ఇక మరో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రుక్‌ నాలుగు అవార్డులు సాధించి తర్వాతి స్థానంలో ఉన్నారు. 

Also Read: అట్టహాసంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పెళ్లి... కాలుష్యం పెరిగిందన్న నిరసనకారులు

Advertisment
తాజా కథనాలు