Anchor Swechcha: స్వేచ్ఛ తండ్రి షాకింగ్ విషయాలు.. తండ్రికి ఫోన్ చేసి ఏం చెప్పిందంటే..?

తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య సంచలనంగా మారింది. శుక్రవారం రాత్రి ఆమె చిక్కడపల్లిలోని ఆమె నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ బలవన్మరణానికి పూర్ణచందరే కారణం ఆమె తండ్రి చెబుతున్నాడు.

New Update

తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య సంచలనంగా మారింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఆమె చిక్కడపల్లిలోని ఆమె నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ చనిపోయిందా లేదా చంపేశారా అని సందేహాలు వస్తున్నాయి. ఫ్యాన్‌కు ఉరేసుకున్న స్వేచ్ఛ కాళ్లు బెడ్‌కు తగిలేలా ఉన్నాయి. అంతేకాదు స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఇంట్లో ఎవరున్నారు అనే విషాయాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. 

స్వేచ్ఛ బలవన్మరణానికి పూర్ణచందరే కారణం ఆమె తండ్రి చెబుతున్నాడు. స్వేచ్ఛ పూర్ణ చందర్‌లో సహజీవనం చేస్తోంది. ఆమెకు మొదటి భర్తతో 13ఏళ్ల కుమార్తె ఉంది. స్వేచ్ఛ మొదటి భర్త కిరణ్‌కు ఐదేళ్ల క్రితం విడాకులు ఇచ్చింది. కొన్నేళ్లుగా పూర్ణచందర్ అనే ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోంది. ఆమె 3 రోజుల కిందటే పూర్ణచందర్‌తో అరుణాచలం వెళ్లివచ్చింది. పూర్ణచందర్‌, స్వేచ్ఛ మధ్య విభేదాలు ఉన్నాయని ఆమె తండ్రి అంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్వేచ్ఛతో మాట్లాడానని ఆమె తండ్రి చెప్పాడు. ఆ సమయంలో పూర్ణచందర్‌తో విడిపోతున్నానని ఆయనకు చెప్పిందట. కాగ నిన్న రాత్రే ఆమె ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచందర్‌కు ఇతర మహిళలతోనూ సంబంధాలు ఉన్నాయని- స్వేచ్ఛ తండ్రి ఆరోపిస్తున్నారు. స్వేచ్ఛకు పూర్ణచందర్‌ అఫైర్స్‌ గురించి చెప్పినా వినలేదని ఆయన చెప్పుకొచ్చారు. పూర్ణ చందర్‌కు పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు. అతను నా కూతుర్ని మూడేళ్లుగా హింసిస్తున్నాడని -స్వేచ్ఛ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

 

 

 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు