Pubg Wife: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

యూపీలోని మహోబా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ PUBG గేమ్‌ ఆడుతూ పంజాబ్‌కు చెందిన యువకుడితో ప్రేమలో పడింది. తన ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలుగా నరుకుతానని భర్తను బెదిరించింది. భయపడిన ఆ భర్త తన భార్యను ఆమె ప్రేమించిన ప్రియుడితో వెళ్ళనిచ్చాడు.

New Update
Pubg Wife

Pubg Wife

ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ PUBG గేమ్ ఆడుతున్నప్పుడు పంజాబ్‌కు చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడింది. అనంతరం తన కొడుకును హింసించింది. భర్తను 55 ముక్కలుగా నరుకుతానని బెదిరించింది. దీంతో భయపడిన ఆ భర్త.. తన భార్యను ఆమె ప్రేమించిన ప్రియుడితో వెళ్ళనిచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!

55 ముక్కలు నరుకుతా

మహోబా జిల్లాకు చెందిన శిలు రాయ్క్వార్‌కు 2022 లో బందా జిల్లాలోని మాతాంధ్‌కు చెందిన ఆరాధనతో వివాహం అయింది. వీరికి ఏడాది కొడుకు కూడా ఉన్నాడు. శిలు వృత్తిరీత్యా స్వీట్లు తయారు చేస్తుంటాడు. ఆరాధన ఇంటివద్దే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె PUBG మొబైల్ గేమ్‌కు బానిసైంది. 

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

Also Read :  జపాన్‌లో ‘ట్విటర్‌ కిల్లర్‌’ కు ఉరి

ఈ సమయంలో ఆరాధనకు పంజాబ్‌లోని లూథియానాకు చెందిన శివం అనే యువకుడితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి భార్య ఆరాధన తన భర్త నుండి దూరం కావడం ప్రారంభించింది. దీంతో ఇద్దరికీ తరచూ గొడవలు జరిగాయి. ఇది కాస్త వైలెంట్‌గా మారడంతో ఆరాధన తన భర్తకు వార్నింగ్ ఇచ్చింది. 

భర్తను 55 ముక్కలుగా నరికి డ్రమ్ లో నింపుతానని బెదిరించింది. తన ప్రేమకు అడ్డుగా మారితే చంపేస్తానని హెచ్చరించింది. ఇక తన భర్త పదే పదే కొడుతున్నాడని తన ప్రియుడు శివంకి చెప్పడంతో అతడు ఏకంగా ఇంటికి వచ్చి గొడవ చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక భర్త శిలు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే పోలీసులు శివంపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం తనకు భర్త, కొడుకు వద్దని.. తాను ప్రియుడితో వెళ్లిపోతానని ఆరాధన చెప్పడంతో భర్త శిలు దానికి ఒప్పుకొని వారిని వెళ్లిపోనిచ్చాడు. 

Advertisment
తాజా కథనాలు