Kannappa Movie First Day Collections: కన్నప్ప ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీ ఇటీవల విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. జూన్ 27వ తేదీ న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 18-20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది.

New Update
kannappa highlight scene

kannappa

మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీ ఇటీవల విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఫ్యాన్స్ నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చాయి. ఏరియా వారీగా ఎంత వచ్చిందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 18-20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. సుమారు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే అధికారికంగా ఫస్ట్ డే కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉంది.

ఇది కూడా చూడండి:Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు

ఇది కూడా చూడండి:Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!

మంచు విష్ణు నటన..

ఇదిలా ఉండగా ఈ సినిమాలో మంచు విష్ణు తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతిథి పాత్రలో ప్రభాస్ మాస్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించింది. ఇంకా మోహన్ లాల్ క్యారెక్టర్ అతి పెద్ద సర్ ప్రైజ్. ముఖ్యంగా చిత్రంలోని ఎలివేషన్స్ అదిరిపోయాయి. అందులోనూ క్లైమాక్స్ లో ఉండే ఎమోషన్స్ సినీ ప్రియుల్ని కట్టిపడేస్తాయి. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమా బాగుందని నెటిజన్లు తెలిపారు. మొత్తానికి సినిమా హిట్ టాక్ అందుకుంది. 

ఇది కూడా చూడండి:Car on a Railway Track : రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. ఆమె మానస్థితిపై అనుమానంతో...

ఇది కూడా చూడండి: MLC Kavita : దూకుడు పెంచిన కవిత..నిన్న కేంద్రమంత్రి, నేడు సీపీఐ ఎంపీతో భేటీ

Advertisment
తాజా కథనాలు