/rtv/media/media_files/2025/06/28/shefali-jariwala-2025-06-28-13-36-42.jpg)
Shefali Jariwala
Shefali Jariwala: ‘కాంటా లగా’ పాటలతో ప్రేక్షకుల హ్యూదాయాలను గెలుచుకున్న బాలీవుడ్ నటి షెఫాలి జరివాలా హఠాత్తుగా మరణించడం అభిమానులకు, ఇండస్ట్రీకి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. షెఫాలి ఆకస్మిక మరణం ఆమె కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. షెఫాలీ నిన్న రాత్రి 11 గంటల సమీపంలో గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షెఫాలీ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. దీంతో ఆమె మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకా స్పష్టత లేదు
షెఫాలీ మృతి గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అర్థరాత్రి 1గంట సమయంలో తమకు ఘటన గురించి సమాచారం అందిందని, అనంతరం అంధేరీలోని ఆమె నివాసానికి వెళ్లి మృదేహాన్ని పరిశీలించామని చెప్పారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. మరణానికి గల కారంలపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. అలాగే ఫోరెన్సిక్ నిపుణులు ఆమె అపార్ట్మెంట్ ని తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు ఇంట్లో పనివాళ్లను, వంట మనిషిని కూడా ఎంక్వేరీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి షెఫాలీ మృతిని అనుమానాస్పద ఘటనగానే పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
అర్ధరాత్రి గుండెపోటు
పలు నివేదికల ప్రకారం, షెఫాలీకి అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆమె భర్త నటుడు పరాగ్ త్యాగి వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆసుపత్రికి చేరుకునే సమయానికే షెఫాలీ చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. షెఫాలి జరివాలా మృతి పట్ల ప్రముఖులు, సినీ తారలు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.
2000ల ప్రారంభంలో విజయవంతమైన ‘కాంటా లగా’ మ్యూజిక్ వీడియోలో తన నటనకు షెఫాలీ జరివాలా బాగా పేరు తెచ్చుకుంది. ఈ పాట ఆమెకు ‘కాంటా లగా గర్ల్’ అనే బిరుదును కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె సల్మాన్ ఖాన్ ముజ్సే షాదీ కరోగిలో నటించింది. అనంతరం ఆమె సల్మాన్ హోస్ట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ 13లో కూడా పాల్గొంది. 2004లో షెఫాలి మీట్ బ్రదర్స్ ఫేమ్ సంగీతకారుడు హర్మీత్ సింగ్‌ను వివాహం చేసుకుంది. కానీ 2009లో విడిపోయింది. 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో వివాహం చేసుకుంది.
Also Read: Law student gang rape: కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. కోల్‌కతా రేప్ కేసులో షాకింగ్ విషయాలు