Smart traffic system: త్వరలోనే డిజిటల్ హైవే.. రూల్స్ అతిక్రమిస్తే జేబులకి చిల్లే!

ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ముందుగా ఢిల్లీ-గురుగ్రామ్‌ను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై డిజిటల్ హైవే తీసుకోచ్చారు. దేశ వ్యాప్తంగా డిజిటల్ హైవేను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

New Update
National highway

Digital Highway

రాబోయే రోజుల్లో అంతా కూడా డిజిటల్ కాబోతుంది. చివరకు హైవే కూడా డిజిటల్ కానుంది. ఈ క్రమంలోనే ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ముందుగా ఢిల్లీ-గురుగ్రామ్‌ను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై డిజిటల్ హైవే తీసుకోచ్చారు. ఇది దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇండియన్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌ దీన్ని అభివృద్ధి చేయగా ఎన్‌హెచ్‌ఏఐ అమలు చేయాలని చూస్తోంది. 

ఇది కూడా చూడండి:Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే..

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ హైవేతో పాటు ఎన్‌హెచ్‌-48పై 28 కిలోమీటర్ల వరకు ఈ డిజిటల్ హైవే ఉంది. దీని ద్వారా ట్రాఫిక్‌ మానిటరింగ్‌, ప్రమాదాలను గుర్తించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయి. సీటు బెల్టు ధరించకుండా ప్రయాణిస్తే అత్యాధునిక కెమెరాలు గుర్తు పట్టేస్తాయి. ట్రిపుల్‌ రైడింగ్‌, ఎక్కువగా వేగంగా వెళ్లినా కూడా గుర్తిస్తుంది. వీటికి NIC ఇ-చలాన్‌ పోర్టల్‌ కూడా లింక్ అయి ఉంటుంది. 

ఇది కూడా చూడండి:Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!

ఒక వేళ ఎవరైనా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తుంది. అలాగే ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డుపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతోంది. వీటికోసం అవగాహన కూడా కల్పించనుంది. ఈ రహదారిపై ఒక కిలోమీటరుకు మొత్తం 110 హై రిజల్యూషన్‌ పీటీజడ్‌ కెమెరాలు ఉంటాయి.24 గంటలు కూడా వీటిపై నిఘా ఉంటుంది. అయితే ఏటీఎంస్‌‌లో మొత్తం ఐదు రకాల వ్యవస్థలు ఉంటాయి.

ఇది కూడా చూడండి:Car on a Railway Track : రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. ఆమె మానస్థితిపై అనుమానంతో...

ట్రాఫిక్‌ మానిటరింగ్‌, ప్రమాదాల వీడియోల చిత్రీకరణ, వాహన వేగం, సైన్‌ బోర్డులు, సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌ వంటివి ఉంటాయి. ఇందులోని కమాండ్ సెంటరీ డిజిటల్ బ్రెయిన్‌గా ఉంటుంది. ప్రమాదం జరిగితే వెంటనే స్థానిక, జాతీయ రహదారి సిబ్బందికి తెలియజేస్తుంది. ముఖ్యంగా దట్టమైన పొగమంచు ఏర్పడడం, ఏవైనా సమస్యలను కూడా తెలియజేస్తుంది. 

Advertisment
తాజా కథనాలు