TG Crime: వరంగల్‌లో దారుణం...కన్నతల్లిని పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కొడుకు

వరంగల్‌ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుమారుడే కన్నతల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన వినోద కు ఆమె కొడుకు సతీష్‌తో ఆస్తి గొడవుల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
Son pours petrol on his mother and sets her on fire

Son pours petrol on his mother and sets her on fire

TG Crime: మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. నవమాసాలు మోసిన తల్లిదండ్రులను కడుపున పుట్టినవాళ్లే కడతేర్చుతున్నారు. నవమాసాలు మోసి పెంచి పెద్దచేసి వారికి ఒక జీవితాన్ని ఇస్తే వారే తల్లిదండ్రుల పాలిట యములవుతున్నారు. జీడిమెట్లలో తల్లిని చంపిన బిడ్డ విషయం మరవకముందే వరంగల్‌ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుమారుడే కన్నతల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన వినోద (50) కొడుకు సతీష్‌తో ఆస్తి గొడవులు ఉన్నాయి.

Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!

గ్రామానికి చెందిన ముత్తినేని సతీష్‌ తన తల్లి వినోద తో ఆస్తి తగాదాల విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో  శనివారం తెల్లవారుజామున డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. కోపంతో రగిలిపోయిన సతీష్‌  తల్లి వినోదపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు.  అనంతరం తల్లి అరుపులు విని గోడదూకి పారిపోయాడు. మంటలకు తలలేక ఆమె అరవడంతో గమనించిన స్థానికులు, బంధువులు వినోదను హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు వినోద 85శాతం కాలిందని తెలిపారు.  ప్రస్తుతం వినోద పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. మెజిస్ట్రేట్ కు తన కన్న కొడుకే పెట్రోల్ పోసి నిప్పంటిచినట్లు వాంగ్మూలం ఇచ్చింది తల్లి వినోద. స్థానిక ఎస్సై నరేశ్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు