PM Modi - Shubhanshu Shukla: ISSలో శుభాంశు శుక్లా.. వీడియో కాల్‌ మాట్లాడిన ప్రధాని మోదీ..

ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోహగామిగా శుభంశు శుక్లా చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ శనివారం ఆయనతో వీడియోల్‌ కాల్‌లో మాట్లాడారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణను ప్రధాని ఎక్స్‌లో షేర్ చేశారు.

New Update
M Modi interacts with Indian astronaut Shubhanshu Shukla

PM Modi interacts with Indian astronaut Shubhanshu Shukla

PM Modi - Shubhanshu Shukla: ఇటీవల అమెరికాలో చేపట్టిన యాక్సియం-4 మిషన్ సక్సెస్‌ అయిన సంగతి తెలిసిందే. ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla)తో సహా నలుగురు వ్యోమగాములు ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ (ISS)లోకి అడుగుపెట్టారు. అయితే ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోహగామిగా శుభంశు శుక్లా చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ శనివారం ఆయనతో వీడియోల్‌ కాల్‌లో మాట్లాడారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణను ప్రధాని ఎక్స్‌లో షేర్ చేశారు. 

Also Read: మళ్లీ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..  భారత్‌కు ఇది గర్వకారణమైన క్షణమని అన్నారు. శుభాంశను అంతరిక్షంలో అనుభవం ఎలా ఉందని అడిగారు. దీనికి శుభాంసు స్పందిస్తు.. అంతరిక్షం నుంచి భూమిని చూడటం ఓ ప్రత్యేక అనుభూతి అని తెలిపారు. ప్రత్యేకంగా భారత్‌ను ఇక్కడి నుంచి చూడటం ఎంతో గర్వంగా అనిపిస్తోందని అన్నారు. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ '' మీరు భారత్‌ నుంచి దూరంగా ఉన్నా దేశ ప్రజల మనస్సుకు దగ్గరగా ఉన్నారు. మీ పేరులో కూడా శుభ్ ఉంది. ఇది అదృష్టాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఇద్దరం మాట్లాడుతున్నప్పటికీ నా వెంట 140 కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలు ఉన్నాయి. అంతరిక్షంలో భారత జెండా ఎగరవేస్తున్నందకు అభినందనలు అని'' ప్రధాని మోదీ తెలిపారు.  

Also Read: త్వరలోనే డిజిటల్ హైవే.. రూల్స్ అతిక్రమిస్తే జేబులకి చిల్లే!

ఇదిలాఉండగా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి యాక్సియం 4 మిషన్‌లో భాగంగా శుభాంశు బ--ృందం.. స్పేస్ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో బుధవారం మధ్యాహ్నం నింగిలోకి దూసుకెళ్లింది. ఫాల్కన్ 9 రాకెట్‌ దీన్ని రోదసిలోకి తీసుకెళ్లింది. ముందుగా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ISS కన్నా తక్కువ కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వివిధ సర్దుబాట్లు, ప్రక్రియలు దాటి అది క్రమంగా ఐఎస్‌ఎస్‌ను చేరుకుంది. భారత్‌కు చెందిన శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ -విస్నీవ్‌స్కీ (పోలండ్‌), టిబర్‌ కపు (హంగేరీ)లు ISSలోకి వెళ్లారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు