/rtv/media/media_files/2025/06/28/pjr-flyover-2025-06-28-12-39-51.jpg)
PJR flyover
PJR flyover :హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి మరో ప్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పి. జనార్ధన్ రెడ్డి ( శిల్పా లే ఔట్ రెండో ఫేస్) ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించనున్నారు.ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే…ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది. ఈ ఫ్లైఓవర్‌ను వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం (SRDP) కింద రూ. 182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 1.2 కి.మీ పొడవు తో కూడుకుని 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్‌లతో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిన మూడవ-స్థాయి నిర్మాణం. క్రింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ ఉంది, దాని పైన శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉంది. ఇప్పుడు దాని పైన ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించారు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను భారీగా తగ్గనుంది. ORR నుండి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాలకు వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా చేరవలసిన గమ్యస్థానాలను వేగంగా చేరుకోవడానికి ఇది సహకరిస్తుంది. కొండాపూర్ ప్రాంతం నుండి, శంషాబాద్ విమానాశ్రయం అక్కడి నుండి కొండాపూర్ ప్రాంతాలకు గచ్చిబౌలి వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా నేరుగా చేరుకోవడానికి అవకాశం ఉంది.
ప్రత్యేకతలు ఏంటంటే?
ఈ ఫ్లైఓవర్‌ను వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం (SRDP) కింద రూ. 182.72 కోట్లతో నిర్మించారు.
ఈ ప్లై ఓవర్ 1.2 కి.మీ పొడవు 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్‌లతో ఉంటుంది.
ఇది ఇప్పటికే నిర్మించిన రెండు పైఓవర్ లపై నిర్మించబడిన మూడవ ప్లై ఓవర్
ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది.
Also Read: కోల్‌కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
Follow Us