Live News Updates: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Ramban Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్!

జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న టాటా సుమో వాహనం రోడ్డు పక్కన ఉన్న 600 అడుగుల  లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడినట్లు సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  

road-accident

జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  పర్యాటకులతో వెళ్తున్న టాటా సుమో వాహనంరోడ్డు పక్కన ఉన్న 600 అడుగుల  లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడినట్లు సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఘటన పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

  • Jul 12, 2025 17:38 IST

    600 డ్రోన్లతో ఉక్రెయిన్‌ డిఫెన్స్ ధ్వంసం చేసిన రష్యా

    కీవ్‌లోని ఆయుధ పరిశ్రమలపై శనివారం రష్యా 600 డ్రోన్లు, క్షిపణులతో వైమానిక దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్‌కు చెందిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ కేంద్రాలు, సైనిక వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఇందులో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

    Russia destroys Ukraine



  • Jul 12, 2025 17:38 IST

    Recording Dance Video: పిచ్చి పరాకాష్ఠ.. వర్థంతి కార్యక్రమంలో రికార్డింగ్ డాన్సులు - వీడియో వైరల్

    వర్ధంతి కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్లు డ్యాన్స్ చేస్తున్న పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో.. ఒక దివంగత మహిళ 4వ వర్ధంతి కార్యక్రమం జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆ వేదికపై ట్రాన్స్‌జెండర్లు డ్యాన్స్ చేస్తున్నారు.

     

    Recording Dance Video
    Recording Dance Video

     



  • Jul 12, 2025 16:29 IST

    గుడివాడలో ఫ్లెక్సీ వార్.. టీడీపీ Vs వైసీపీ.. హైటెన్షన్!-VIDEO

    గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలు చింపేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

    TDP Vs YCP in Gudiwada



  • Jul 12, 2025 14:08 IST

    Bhumana Karunakar Reddy : బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక కుట్ర .. భూమన ఫైర్!

    టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉన్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.  బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

    bandi-sanjay



  • Jul 12, 2025 14:07 IST

    Perni Nani: ఏందీరా రప్పా రప్పా.. మన ప్రభుత్వం వచ్చాక నరికేయండి.. పేర్ని నాని సంచలన కామెంట్స్!

    వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు.  మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని ఫైరయ్యారు. చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికెయ్యాలని కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ ప్రసంగించారు.

    perni-nani



  • Jul 12, 2025 14:06 IST

    Prakash Raj: అమ్ముడుపోవడం అంటే ఇది.. ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చిన జనసేన

    హిందీ భాషపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన పార్టీకి చెందిన జనసేన శతగ్ని అనే సోషల్ మీడియా విభాగం ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చింది.

     

    Janasena Social Media Wing Counter to Parakash raj
    Janasena Social Media Wing Counter to Parakash raj

     



  • Jul 12, 2025 13:29 IST

    Sajjanar Video: ఈ వీడియోను మీ పిల్లలకు ఒక్కసారి తప్పక చూపించండి.. సజ్జనార్ పోస్ట్ వైరల్!

    టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ సోషల్ మీడియాలో ఎప్పటికప్పడు  సామజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు.  తాజాగా చిన్నారుల భద్రత గురించి ఆయన షేర్ చేసిన వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది.

     

    VC Sajjanar
    VC Sajjanar

     



  • Jul 12, 2025 12:48 IST

    BIG BREAKING: జనసేన నుంచి కీలక నేత ఔట్.. సస్పెండ్ చేసిన పవన్!

    శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోట వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై హత్య కేసు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాయుడు అనే యువకుడి హత్య చేసులో వినుతతో పాటు ఆమె భర్తను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

    Janasena Srikala Hasthi In charge



  • Jul 12, 2025 11:29 IST

    BIG BREAKING : మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

    శ్రీనివాసులు హత్య కేసు మిస్టరీ వీడింది. చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

    vinuta-kota



  • Jul 12, 2025 11:29 IST

    Ramban Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్!

    జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న టాటా సుమో వాహనం రోడ్డు పక్కన ఉన్న 600 అడుగుల  లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడినట్లు సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  

    road-accident



  • Jul 12, 2025 11:28 IST

    Building Collapse : ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!

    ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. శనివారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలోని జనతా మజ్దూర్ కాలనీలో జరిగింది.

    delhi-buliding



  • Jul 12, 2025 11:28 IST

    Prakash Raj : ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !

    జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తరచుగా విమర్శలు చేసే ప్రకాష్ రాజ్ మరోసారి రెచ్చిపోయారు.  జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రకాశ్ రాజ్.  హిందీ భాషను సమర్ధిస్తూ పవన్ చేసిన కామెంట్స్‌పై సెటైర్లు వేశారు.

    pawan-kalyan



  • Jul 12, 2025 11:27 IST

    MEGA 157 : ఇట్స్ అమేజింగ్.. అనిల్, చిరు సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్!

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 157వ సినిమాకి ఇంకా అధికారిక టైటిల్ ఖరారు కాలేదు. దీనికి 'మెగా 157' అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు "మన శంకరవరప్రసాద్" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

    mega1157



  • Jul 12, 2025 11:27 IST

    TV actress : వరకట్న వేధింపులు.. సీరియల్ నటిని పొడిచి పొడిచి భర్త పరార్!

    బెంగళూరులో టీవీ నటి శ్రుతిపై హత్యాయత్నం జరిగింది. ఆమె భర్త అమరేష్ కత్తితో పొడిచి పరారయ్యాడు.   ఈ సంఘటన బెంగళూరులోని హనుమంతనగర్ ప్రాంతంలో జులై 4న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై హనుమంతనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

    tv-actress



  • Jul 12, 2025 11:26 IST

    Ap Crime : అత్తతో అక్రమ సంబంధం... రూ.4 లక్షల సుపారీ ఇచ్చి అల్లుడిని లేపేసిన మామ!

    ఏపీలోని ధర్మవరంలోని ముదిగుబ్బలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.  విశ్వనాథ్‌ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మామే అల్లుడిని  రూ.4 లక్షలకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా విచారణలో తేలింది.

    ap-crime



  • Jul 12, 2025 11:25 IST

    Arunachalam: అరుణాచలంలో దారుణం.. గిరి ప్రదక్షిణలో తెలంగాణ యువకుడు దారణ హత్య!

    తిరువణ్ణామలైలో దారుణం జరిగింది. అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు దారుణ  హత్యకు గురయ్యాడు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన విద్యాసాగర్‌ (32)  తిరువణ్ణామలై వెళ్లారు. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు.

    arunachalam



  • Jul 12, 2025 11:23 IST

    Chirag Paswan: నిన్ను చంపేస్తాం..కేంద్రమంత్రికి హత్య బెదిరింపులు

    లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు సోషల్ మీడియా ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయి. ఆయన పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రాజేష్ భట్ ఈ మేరకు పాట్నాలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు.

    patna-police



  • Jul 12, 2025 10:46 IST

    Crime: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!

    మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. నవజాత చిన్నారి మృతి చెందిందని వైద్యులు చెప్పటంతో తల్లిదండ్రులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే ఖననం చేసే టైంలో శిశువు గట్టిగా ఏడ్చాడు. వెంటనే బాబును ఆస్పత్రికి తరలించారు.

     

    Newborn baby died
    Newborn baby died

     



  • Jul 12, 2025 10:37 IST

    Peddi Movie: 'గౌర్ నాయుడు' గా శివరాజ్ కుమార్.. పెద్ది ఫస్ట్ లుక్ అదిరింది!

    రామ్ చరణ్ 'పెద్ది' నుంచి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పెద్ద పెద్ద మీసాలు, గంభీరమైన చూపుతో శివరాజ్ కుమార్ లుక్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఇందులో ఆయన  'గౌర్నాయుడు' పాత్రలో కనిపించబోతున్నారు.  

     

    peddi Shiva Rajkumar first look
    peddi Shiva Rajkumar first look

     



  • Jul 12, 2025 10:37 IST

    Junior Trailer: 13 ఏళ్ళ తర్వాత జెనీలియా రీ ఎంట్రీ.. జూనియర్ ట్రైలర్ చూశారా!

    యంగ్ బ్యూటీ శ్రీలీల- కిరీటీ రెడ్డి జంటగా నటించిన తాజా చిత్రం జూనియర్ ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, కామెడీ, భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం జులై 18న విడుదల కానుంది. ఇందులో సీనియర్ హీరోయిన్ జెనీలియా, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

     

    junior trailer
    junior trailer

     



Advertisment
Advertisment
తాజా కథనాలు