/rtv/media/media_files/2025/07/12/arunachalam-2025-07-12-06-46-53.jpg)
తిరువణ్ణామలైలో దారుణం జరిగింది. అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ (32) తిరువణ్ణామలై వెళ్లారు. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు అతన్ని అడ్డుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడానికి విద్యాసాగర్ నిరాకరించడంతో కోపంలో ఉన్న ఆ ఇద్దరు యువకులు విద్యాసాగర్ ను కత్తితో గొంతు కోసి హత్య చేసి అతని వద్ద నుండి సుమారు రూ.5,000 లాక్కొని అక్కడి నుండి పారిపోయారు.
ఇద్దరు నిందితులు అరెస్ట్
అపస్మారక స్థితిలో పడి ఉన్న విద్యాసాగర్ ను వెంటనే తోటి భక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల రికార్డింగ్‌లను పరిశీలించిన పోలీసులు విచారణలో, తిరువణ్ణామలైకి చెందిన కుగణేశ్వరన్ (21), తమిళరసన్ (25) విద్యాసాగర్ నుండి డబ్బును లాక్కొని పారిపోయారని తేలింది వారిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Prakash Raj : ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !
దుండగులు యువకుడి గొంతు కోసి డబ్బు వసూలు చేయడంతో భక్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కాగా తిరువణ్ణామలైలోని ఆలయానని సందర్శి్స్తే మోక్షం లభిస్తుందని భక్తులు బాగా నమ్ముతారు. నెలవారీ పౌర్ణమి రాత్రి భక్తులు సాధారణంగా ఈ ప్రసిద్ధ ఆలయానికి 14 కిలోమీటర్ల యాత్ర చేస్తారు.
Also Read : MEGA 157 : ఇట్స్ అమేజింగ్.. అనిల్, చిరు సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్!
Also read : AP Crime: డబ్బులు పంపడి.. దోషాలు పోగొడతాం.. శ్రీకాళహస్తిలో బరితెగించిన పూజారులు!