/rtv/media/media_files/2025/07/12/newborn-baby-died-2025-07-12-10-12-51.jpg)
Newborn baby died
Crime: మహారాష్ట్రలో హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నూతన జీవితం దాదాపు నశించిపోయే ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. బీడ్ జిల్లాలోని హోల్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఈ నెల 7న స్వామి రామానంద తీర్ధ ఆస్పత్రిలో నెలలు నిండకముందే మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అప్పుడే ఆ శిశువు పరిస్థితిని పరీక్షించిన వైద్యులు శిశువు మృతి చెందిందని తేల్చేశారు. తమ బిడ్డను కోల్పోయిన శోకసంద్రంలో తల్లిదండ్రులు గ్రామానికి చేరుకుని చిన్నారి శవాన్ని ఖననం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఖననం సమయంలో ఏడ్చిన శిశువు:
ఈ సంఘటన మరుసటి రోజు ఊహించని మలుపు తిరిగింది. శిశువును ఖననం చేసే సమయంలో అతని ముఖాన్ని చివరిసారిగా చూడాలనుకున్న అమ్మమ్మ ఒత్తిడి చేయడంతో ముఖంపై వేసిన వస్త్రాన్ని తీసివేశారు. ఇదే సమయంలో ఆ శిశువు ఒక్కసారిగా గట్టిగా ఏడవడం ప్రారంభించడంతో అక్కడ ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. చనిపోయినట్లుగా భావించిన శిశువు నిజంగా బతికివుండటం గ్రహించిన తల్లిదండ్రులు వెంటనే తిరిగి ఆసుపత్రికి పరుగులు పెట్టారు. శిశువును చికిత్స కోసం తీసుకెళ్లాడరు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: డబ్బులు పంపడి.. దోషాలు పోగొడతాం.. శ్రీకాళహస్తిలో బరితెగించిన పూజారులు!
ఈ ఘటన వెలుగులోకి రాగానే ఆసుపత్రి ముందు బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్థులు నిరసనలకు దిగారు. వైద్యులు శిశువు ప్రాణాలను చెలగాటం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసు పట్ల స్పందించిన ఆసుపత్రి ఇన్‌ఛార్జి డాక్టర్ రాజేశ్ కచ్‌రే ఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని తప్పుదోవ పట్టినవారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ శివారుల్లో చిరుతల సంచారం కలకలం
( crime | crime news | Latest News | telugu-news)