/rtv/media/media_files/2025/07/12/patna-police-2025-07-12-06-23-07.jpg)
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు సోషల్ మీడియా ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయి. ఆయన పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రాజేష్ భట్ ఈ మేరకు పాట్నాలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. 'టైగర్ మెరాజ్ ఇడిసి' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ బెదిరింపు వచ్చినట్లు రాజేష్ భట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక యూట్యూబర్ -జర్నలిస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ బెదిరింపు పోస్ట్ వచ్చింది.
🔴 Breaking News 🔴
— Vihan Rathore (@Vihan_Rathor) July 11, 2025
Union Minister Chirag Paswan receives death threat LJP (Ram Vilas) files complaint at Cyber Police Station. Strong demand for strict action against the culprits.
ప్రజాదరణ కారణంగానే
చిరాగ్ పాశ్వాన్ పెరుగుతున్న ప్రజాదరణ కారణంగానే ఈ బెదిరింపు వచ్చిందని రాజేష్ భట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అలస్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఈ ఘటనపై పాట్నా సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, దర్యాప్తు జరుగుతోందని సైబర్ డీసీపీ నితీష్ చంద్ర ధారియా తెలిపారు. ఈ హత్య బెదిరింపులు బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రావడం సంచలనంగా మారింది.
చిరాగ్ పాశ్వాన్ ఇటీవల బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. గతంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం జెడ్-కేటగిరీ భద్రతను కూడా కల్పించింది. కాగా ఎల్జేపీ (రామ్ విలాస్) జనతాదళ్ (యునైటెడ్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లతో కలిసి అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో భాగం. రాబోయే బీహార్ ఎన్నికలకు ఎల్జేపీ ఎన్డీఏతో పొత్తు కొనసాగించే అవకాశం ఉంది, ఈ ఏడాది చివర్లో అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.