BIG BREAKING: జనసేన నుంచి కీలక నేత ఔట్.. సస్పెండ్ చేసిన పవన్!

శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోట వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై హత్య కేసు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాయుడు అనే యువకుడి హత్య చేసులో వినుతతో పాటు ఆమె భర్తను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Janasena Srikala Hasthi In charge

శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోట వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై హత్య కేసు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ హైకమాండ్ ప్రకటనలో పేర్కొంది. చెన్నైలో కాళహస్తి యువకుడి దారుణహత్య వార్త సంచలనంగా మారింది. రాయుడు అనే యువకుడు కూవం నదిలో శవమై తేలాడు. ఆ యువకుడిని ఐదుగురు వ్యక్తులు చిత్రహింసలు పెట్టి చంపినట్లు తెలుస్తోంది. నిందితుల్లో కాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినూత, భర్త చంద్రబాబు ఉన్నట్లు వార్తలు రావడం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: BIG BREAKING : మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

ఈ క్రమంలో చెన్నై పోలీసులు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న వినూత, చంద్రబాబు, శివకుమార్, గోపి, దాసర్‌ ను అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను  పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్ట్ నేపథ్యంలో జనసేన పార్టీ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఈ క్రమంలో విజితను జనసేన కాళహస్తి నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
ఇది కూడా చదవండి: Prakash Raj : ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !

ఇది కూడా చదవండి:BIG BREAKING: నెల్లూరు జిల్లా కోవూరులో కలకలం.. మీటింగ్ లోనే పురుగుల మందు తాగిన టీడీపీ కార్యకర్త!

Advertisment
Advertisment
తాజా కథనాలు