/rtv/media/media_files/2025/07/12/vc-sajjanar-2025-07-12-12-36-47.jpg)
VC Sajjanar
VC Sajjanar: టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పడు సామజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్, ర్యాష్ డ్రైవింగ్, రోడ్డు యాక్సిడెంట్స్ ఇలా పలు సంఘటనలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తారు. తాజాగా చిన్నారుల భద్రత గురించి ఆయన షేర్ చేసిన వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి ఆకర్షణీయమైన వీడియోలతో పిల్లలకు ''గుడ్ టచ్ బ్యాడ్ టచ్'' పై అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆటపాటల రూపంలో, పద్యంలా వీటిని నేర్పడం ద్వారా వారు సులభంగా అర్థం చేసుకుంటారని తెలిపారు. ఈరోజు నుంచే మీ బిడ్డను దైర్యంగా, శక్తివంతులుగా చేయండి అని సూచించారు.
Also Read: HBD Shiva Rajkumar: 'హ్యాట్రిక్ హీరో' నిమ్మ శివన్న బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు మీకు తెలుసా!
🌟 Teach kids "Good Touch, Bad Touch" with this engaging awareness video!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 12, 2025
Parents, help them learn these lines as a fun poem to understand safe boundaries.
Empower your child today! 💪#ChildSafety#GoodTouchBadTouch#Parenting#Empowermentpic.twitter.com/e54Kcx8IfZ
Also Read:Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!
తల్లిదండ్రుల బాధ్యత
ప్రస్తుత సమాజంలో కొందరు అమానుషులు చిన్నారుల అమాయకత్వాన్ని, బలహీనతను ఆసరాగా చేసుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సొంత కుటుంబ సభ్యులను కూడా నమ్మలేని రోజులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం తల్లిదండ్రుల బాధ్యత. కావున చిన్నతనం నుంచే వారికి "మంచి స్పర్శ, చెడు స్పర్శ" సరైన అవగాహన కల్పించాలి. ఇది వారిని అవాంఛనీయ పరిస్థితుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.