Russia Destroys Ukraine Defenses: 600 డ్రోన్లతో ఉక్రెయిన్‌ డిఫెన్స్ ధ్వంసం చేసిన రష్యా

కీవ్‌లోని ఆయుధ పరిశ్రమలపై శనివారం రష్యా 600 డ్రోన్లు, క్షిపణులతో వైమానిక దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్‌కు చెందిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ కేంద్రాలు, సైనిక వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఇందులో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

New Update
Russia destroys Ukraine

Russia Destroys Ukraine Defenses

Russia Destroys Ukraine Defenses:

ఉక్రెయిన్‌పై రష్యా ఇంకా దాడులు కొనసాగిస్తోంది. శనివారం కీవ్‌లోని ఆయుధ పరిశ్రమలపై రష్యా 600 డ్రోన్లు, క్షిపణులతో వైమానిక దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్‌కు చెందిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ కేంద్రాలు, సైనిక వైమానిక స్థావరాలపైనా దాడులు నిర్వహించినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా.. బిల్డింగులు, మౌలిక సదుపాయాలు, విశ్వవిద్యాలయాలు దెబ్బతిన్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. 

Also Read: HBD Shiva Rajkumar: 'హ్యాట్రిక్ హీరో' నిమ్మ శివన్న బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు మీకు తెలుసా!

Also Read: COOLIE Monica Song: రజినీకాంత్ ‘కూలీ’ నుంచి పూజాహెగ్డే ఊరమాస్ సాంగ్.. గూస్‌బంప్స్ స్టెప్పులతో రప్పా రప్పా

రష్యా ప్రయోగించిన 319 డ్రోన్‌లు, 25 క్రూజ్‌ క్షిపణులను నేలకూల్చినట్లు ఉక్రెయిన్‌ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్‌ వెల్లడించింది. ఉక్రెయిన్ చేపట్టిన ఎదురు దాడుల్లో మాస్కోలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. తమతో జరుగుతున్న యుద్ధంలో రష్యా వాడుతున్న 40 శాతం బాలిస్టిక్‌ క్షిపణులు, ఫిరంగి వ్యవస్థలు ఉత్తరకొరియా నుంచే రష్యాకు అందుతున్నాయని ఉక్రెయిన్‌ ఆరోపించింది. తర్వాత కొన్ని గంటల్లోనే రష్యా ఆర్మీ ఈ దాడులకు పాల్పడడం గమనార్హం.

Also Read: Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!

పుతిన్‌ సేనలు కొనసాగిస్తున్న యుద్ధానికి గట్టిగా బదులు చెప్తామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం పేర్కొన్నారు. యుద్ధం విషయంలో త్వరగా ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని ఆయుధాల సరఫరాను తిరిగి ప్రారంభించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇందులో 155 ఎంఎం మందుగుండు సామాగ్రితో పాటు జీఎంఎల్‌ఆర్‌ఎస్‌గా పిలిచే ప్రెసిషన్‌ గైడెడ్‌ రాకెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు