Junior Trailer: యంగ్ బ్యూటీ శ్రీలీల- కిరీటీ రెడ్డి జంటగా నటించిన తాజా చిత్రం జూనియర్ ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, కామెడీ, భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జీవితం పట్ల నిర్లక్ష్యంగా ఉండే కాలేజీ విద్యార్ధి అభి జీవితం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అప్పటివరకు కాలేజీ, ప్రేమ, ఫ్రెండ్స్ అంటూ సరదాగా సాగిన అభి జీవితం.. తన తండ్రి దాచిన కష్ఠాలను, పోరాటాలను తెలుసుకున్న తర్వాత నాటకీయ మలుపు తిరుగుతుంది. హీరో(కిరీటి) తండ్రిగా రవి చంద్రన్ నటించారు. వీరిద్దరి మధ్య భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా కూడా కీలక పాత్రలో కనిపించి అలరించారు.
Happy to launch the #JuniorTrailer.
— Kichcha Sudeepa (@KicchaSudeep) July 11, 2025
▶️ https://t.co/aBtuuLTKx2
Best wshs @KireetiOfficial and to the entire team .
@geneliad, @sreeleela14, @ThisIsDSP, @SaiKorrapati_#JuniorOnJuly18th@DOPSenthilKumar@rk91_reddy@CrazystarL@neeta_lulla@PeterHeinOffl@NiranjanD_ND…
జెనీలియా రీ ఎంట్రీ
13 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ జెనీలియా దాదాపు 13 ఏళ్ళ మళ్ళీ తెలుగు తెరపై కనిపించబోతుంది. ఆమె తెలుగులో చివరిగా 2012లో రానా దగ్గుబాటి సరసన 'నా ఇష్టం' సినిమా చేసింది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైనా ఈ ముద్దుగుమ్మ హిందీ మరాఠి సినిమాలతో బిజీ అయిపోయింది. ఎట్టకేలకు ఇప్పుడు 'జూనియర్' సినిమాతో తిరిగి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జెనీలియా తెలుగులో బాయ్స్, బొమ్మరిల్లు, సై, సత్యం, శశిరేఖా పరిణయం, ఢీ, హ్యాపీ వంటి సూపర్ హిట్ చిత్రాలతో అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించింది.
ఇదిలా ఉంటే 'జూనియర్' చిత్రం జులై 18న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ మేరకు ట్రైలర్, సాంగ్స్ ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్రబృందం. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన 'వైరల్ వయ్యారి' సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. విడుదలైన వారం రోజుల్లో 12 మిలియన్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నెటిజన్లు ఈపాటపై రీల్స్ చేస్తున్న వీడియోలే కనిపిస్తున్నాయి. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజని కొర్రపాటి నిర్మించారు. కిరిటీ ఈ సినిమాతో తొలిసారి వెండితెరకు పరిచయం అవుతున్నారు.