Prakash Raj: అమ్ముడుపోవడం అంటే ఇది.. ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చిన జనసేన

హిందీ భాషపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన పార్టీకి చెందిన జనసేన శతగ్ని అనే సోషల్ మీడియా విభాగం ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చింది.

New Update
Janasena Social Media Wing Counter to Parakash raj

Janasena Social Media Wing Counter to Parakash raj

Prakash Raj:

హిందీ భాషపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశవుతున్నాయి. మాతృభాష ఇంట్లో మాట్లాడుకోవడానికి సరిపోతుంది. ఇంటి సరిహద్దులు దాటితే మన రాజ్యభాష హిందీ అని ఆయన మాట్లాడటం వివాదస్పదమైంది. దీనిపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ''ఈ రేంజ్‌కి అమ్ముడు పోవడమా.. ఛీ..ఛీ అంటూ'' ఎక్స్‌లో విమర్శించారు. అయితే ప్రకాశ్ రాజ్‌ కామెంట్స్‌పై తాజాగా జనసేన పార్టీకి చెందిన జనసేన శతగ్ని అనే సోషల్ మీడియా విభాగం కౌంటర్ ఇచ్చింది.

Also Read: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!

అమ్ముడుపోవడం అంటే ఇది అంటూ ప్రకాశ్‌రాజ్‌ పాత వీడియోను షేర్ చేసింది. ''ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పు అంటే   నువ్వు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చెయ్యగలవా? ఈరోజు ఇలా అమ్ముడుపోయి మాట్లాడగలవా? అంటూ'' విమర్శించింది. 

Also Read:మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

Also Read:ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!

Also Read:ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు