టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉన్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారని స్వయంగా కేంద్ర మంత్రే మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లుగా భూమన తెలిపారు. అసలు ఏ ప్రాతిపదికన టీటీడీలో వెయ్యి మంది అన్యమతస్థ ఉద్యోగులన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!
టీటీడీలో 22 మంది అన్యమతస్థ ఉద్యోగులు ఉన్నారని ప్రస్తుత పాలకమండలి ఇటీవలే ప్రకటించిందని గుర్తుచేశారు. పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడిని పెట్టుకుని కూడా సంజయ్ అలా మాట్లాడడం సరికాదని వెల్లడించారు. బండి సంజయ్ చర్య తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై దాడిలాగా భావిస్తున్నట్లు భూమన అభివర్ణించారు. బండి సంజయ్ వ్యాఖ్యలో కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు తనకు కలుగుతున్నాయని తెలిపారు సంజయ్ వాఖ్యలపై ఇప్పటి వరకు టీటీడీ కానీ, ప్రభుత్వం గానీ స్పందించకపోవడం దేనికి సంకేతమని భూమన ప్రశ్నించారు.
బండి సంజయ్ సంచలన కామెంట్స్
తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు బండి సంజయ్. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో అన్యమతస్థుల ఉద్యోగాల వ్యవహారంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీటీడీలో 1000 మందికి పైగా అన్యమతస్థులు పని చేస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక అభ్యర్థన కాదని, కఠినమైన డిమాండ్ అని స్పష్టం చేశారు. , హిందూ ధర్మంపై, దేవుడిపై నమ్మకం లేని వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు టీటీడీలో ఎందుకు పని చేస్తున్నారని ప్రశ్నించారు. వారి ఉనికి ఆలయ మత సంప్రదాయాలు, ఆచారాలను ప్రభావితం చేస్తుందని ఆరోపించారు. పవిత్రమైన సంస్థ అయిన టీటీడీ విషయంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయవద్దని సూచించారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని కొనసాగించడం తప్పని అన్నారు.
Bhumana Karunakar Reddy : బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక కుట్ర .. భూమన ఫైర్!
టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉన్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉన్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారని స్వయంగా కేంద్ర మంత్రే మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లుగా భూమన తెలిపారు. అసలు ఏ ప్రాతిపదికన టీటీడీలో వెయ్యి మంది అన్యమతస్థ ఉద్యోగులన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!
టీటీడీలో 22 మంది అన్యమతస్థ ఉద్యోగులు ఉన్నారని ప్రస్తుత పాలకమండలి ఇటీవలే ప్రకటించిందని గుర్తుచేశారు. పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడిని పెట్టుకుని కూడా సంజయ్ అలా మాట్లాడడం సరికాదని వెల్లడించారు. బండి సంజయ్ చర్య తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై దాడిలాగా భావిస్తున్నట్లు భూమన అభివర్ణించారు. బండి సంజయ్ వ్యాఖ్యలో కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు తనకు కలుగుతున్నాయని తెలిపారు సంజయ్ వాఖ్యలపై ఇప్పటి వరకు టీటీడీ కానీ, ప్రభుత్వం గానీ స్పందించకపోవడం దేనికి సంకేతమని భూమన ప్రశ్నించారు.
Also Read:ఈ రేంజ్కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !
Also Read:ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్!
బండి సంజయ్ సంచలన కామెంట్స్
తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు బండి సంజయ్. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో అన్యమతస్థుల ఉద్యోగాల వ్యవహారంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీటీడీలో 1000 మందికి పైగా అన్యమతస్థులు పని చేస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక అభ్యర్థన కాదని, కఠినమైన డిమాండ్ అని స్పష్టం చేశారు. , హిందూ ధర్మంపై, దేవుడిపై నమ్మకం లేని వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు టీటీడీలో ఎందుకు పని చేస్తున్నారని ప్రశ్నించారు. వారి ఉనికి ఆలయ మత సంప్రదాయాలు, ఆచారాలను ప్రభావితం చేస్తుందని ఆరోపించారు. పవిత్రమైన సంస్థ అయిన టీటీడీ విషయంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయవద్దని సూచించారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని కొనసాగించడం తప్పని అన్నారు.
Also Read:మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!