/rtv/media/media_files/2025/07/12/pawan-kalyan-2025-07-12-09-19-19.jpg)
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తరచుగా విమర్శలు చేసే ప్రకాష్ రాజ్ మరోసారి రెచ్చిపోయారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రకాశ్ రాజ్. హిందీ భాషను సమర్ధిస్తూ పవన్ చేసిన కామెంట్స్‌పై సెటైర్లు వేశారు. తెలుగు అమ్మభాష అయితే.. హిందీ పెద్దమ్మ భాష అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ హిందీని రాజ్యభాషగా పేర్కొనడం, తమిళనాడులో హిందీని వ్యతిరేకించడంపై చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. "ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.." అంటూ పవన్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ విమర్శించారు. హిందీని రుద్దడాన్ని వ్యతిరేకించడం మాతృభాష స్వాభిమానమే తప్ప ద్వేషం కాదని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ప్రకాష్ రాజ్‌పై అదే స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justaskinghttps://t.co/Fv9iIU6PFj
— Prakash Raj (@prakashraaj) July 11, 2025
నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్?
గతంలో తిరుపతి లడ్డూ కల్తీ అయ్యిందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పడంపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. "సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్? నీకుఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి" అని ప్రశ్నించారు. సొంత రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్, లడ్డూ కల్తీపై విచారణ చేయించి దోషులను శిక్షించాలని, అనవసరంగా భయాలు సృష్టించవద్దని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడారని, అయితే అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సమయం వృథా చేస్తున్నారని పలుమార్లు ప్రకాష్ రాజ్ ఆరోపించారు.
Also Read : MEGA 157 : ఇట్స్ అమేజింగ్.. అనిల్, చిరు సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్!