BIG BREAKING : మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

శ్రీనివాసులు హత్య కేసు మిస్టరీ వీడింది. చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

New Update
vinuta-kota

శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీ వీడింది. మొన్న చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో ఐదుగురిని చెన్నై  పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   యువకుడి హత్య గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్నీ కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినుత వద్ద కారు డ్రైవర్ గా, పీఏగా కూడా పనిచేశాడు.  రెండు వారాల కిందటే అతన్ని ఆమె విధుల నుంచి తొలగించినట్లుగా సమాచారం.

మూడు రోజుల క్రితం

చెన్నై మింట్ పీఎస్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. మృతుడి చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినుత పేరు ఉండడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో ఈ నెల 8వ తేదీన రాయడిని హత్య చేసి నదీలో పడేసినట్లుగా తెలుస్తోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే నమ్మినబంటుగా ఉన్న రాయుడు చేసిన ద్రోహానికి అతన్ని తొలిగిస్తున్నట్లుగా జూన్ 21వ తేదీన ఆమె బహిరంగగా ప్రకటన చేశారు.  ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు రాయుడు హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు