Recording Dance Video: పిచ్చి పరాకాష్ఠ.. వర్థంతి కార్యక్రమంలో రికార్డింగ్ డాన్సులు - వీడియో వైరల్

వర్ధంతి కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్లు డ్యాన్స్ చేస్తున్న పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో.. ఒక దివంగత మహిళ 4వ వర్ధంతి కార్యక్రమం జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆ వేదికపై ట్రాన్స్‌జెండర్లు డ్యాన్స్ చేస్తున్నారు.

New Update
Recording Dance Video

Recording Dance Video

Recording Dance Video:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'రికార్డింగ్ డాన్స్‌లు' (Recording Dances) తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, పబ్బాలు, జాతరలు, గ్రామాల్లో జరిగే చిన్నపాటి ఉత్సవాలు, వేడుకల్లో రికార్డింగ్ డాన్స్‌లను ఏర్పాటు చేయడం సాధారణమైపోయింది. అయితే, ఈ ప్రదర్శనలు కొన్నిసార్లు శృతి మించి, అశ్లీల నృత్యాలకు దారితీస్తుండటంతో వీటిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

Recording Dance Video

గ్రామ దేవతల జాతరలు, పండుగల సమయంలో రికార్డింగ్ డాన్స్‌లు ఒక ప్రధాన ఆకర్షణగా మారాయి. ఇవి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక వినోద సాధనంగా ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల అసభ్యకర నృత్యాలతో వివాదాలకు దారితీస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచినప్పుడు లేదా ఏదైనా రాజకీయ కార్యక్రమాల సందర్భంగా కూడా రికార్డింగ్ డాన్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 

Also Read: Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!

ఇటీవల పిఠాపురం, కోనసీమ ప్రాంతాల్లో జరిగిన కొన్ని రాజకీయ కార్యక్రమాల్లో ఇలాంటి నృత్యాలు వివాదాస్పదమయ్యాయి. కొన్ని కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో కూడా వినోదం కోసం రికార్డింగ్ డాన్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే అక్కడ వరకు ఓకే కానీ.. వర్థంతి కార్యక్రమాల్లోనూ కొందరు రికార్డింగ్ డాన్స్‌లను ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్లతో ఇలాంటి నృత్యాలు చేయించిన పాత వీడియోలు వైరల్ కావడం చర్చకు దారితీసింది. 

Also Read: COOLIE Monica Song: రజినీకాంత్ ‘కూలీ’ నుంచి పూజాహెగ్డే ఊరమాస్ సాంగ్.. గూస్‌బంప్స్ స్టెప్పులతో రప్పా రప్పా

గతంలో జరిగిన ఒక మరణ వార్షికోత్సవ కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్లు డ్యాన్స్ చేస్తున్న పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక దివంగత మహిళ 4వ వర్ధంతి కార్యక్రమం జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆ వేదికపై కొందరు ట్రాన్స్‌జెండర్లు పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్‌లు సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయని, దివంగతులకు అగౌరవం కలిగించేలా ఉన్నాయని కొందరు మండిపడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట మరోసారి వైరల్‌గా మారాయి. 

Also Read: HBD Shiva Rajkumar: 'హ్యాట్రిక్ హీరో' నిమ్మ శివన్న బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు మీకు తెలుసా!

Advertisment
Advertisment
తాజా కథనాలు