Perni Nani: ఏందీరా రప్పా రప్పా.. మన ప్రభుత్వం వచ్చాక నరికేయండి.. పేర్ని నాని సంచలన కామెంట్స్!

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు.  మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని ఫైరయ్యారు. చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికెయ్యాలని కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ ప్రసంగించారు.

New Update
perni-nani

Perni Nani

Perni Nani: వైసీపీ(YCP) నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్(Perni Nani Viral Comments) చేశారు.  మంత్రి లోకేష్ రెడ్ బుక్(Lokesh Red Book) అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని ఫైరయ్యారు. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి.. నరికేస్తాం అని అరవటం కాదు.. చీకట్లో మొత్తం అయిపోవాలి.. ఆ తరువాత వెళ్లి ఎలా జరిగింది, ఏంటి అని పరామర్శించాలన్నారు.

Also Read: మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

రాత్రికి రాత్రే అంతా జరిగిపోవాలి

చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు అసహ్యంగా ఏంటీ ఇది.. రాత్రికి రాత్రే అంతా జరిగిపోవాలి. ఇప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్న వారిని మన ప్రభుత్వం వచ్చాక కరిచేయ్. దాన్ని ఎవడికైనా చెప్పాలా.  ఆ తరువాత ఏం జరిగిందో తెలియనట్టుగా వెళ్లి పరామర్శించాలన్నారు.  చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికెయ్యాలని కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ ప్రసంగించారు. కృష్ణాజిల్లా పామర్రు, అవనిగడ్డలలో గురు, శుక్రవారాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్!

Also Read: ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!

Also Read: ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !

Advertisment
Advertisment
తాజా కథనాలు