Peddi Movie:  'గౌర్ నాయుడు' గా శివరాజ్ కుమార్.. పెద్ది ఫస్ట్ లుక్ అదిరింది!

రామ్ చరణ్ 'పెద్ది' నుంచి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పెద్ద పెద్ద మీసాలు, గంభీరమైన చూపుతో శివరాజ్ కుమార్ లుక్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఇందులో ఆయన  'గౌర్నాయుడు' పాత్రలో కనిపించబోతున్నారు.  

New Update

Peddi Movie:  నేడు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. రామ్ చరణ్  'పెద్ది' ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.  పెద్ద పెద్ద మీసాలు, గంభీరమైన చూపుతో శివరాజ్ కుమార్ లుక్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఇందులో ఆయన  'గౌర్నాయుడు' పాత్రలో కనిపించబోతున్నారు.  పోస్టర్ చూస్తుంటే సినిమాలో శివరాజ్ కుమార్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: COOLIE Monica Song: రజినీకాంత్ ‘కూలీ’ నుంచి పూజాహెగ్డే ఊరమాస్ సాంగ్.. గూస్‌బంప్స్ స్టెప్పులతో రప్పా రప్పా

గ్రామీణ నేపథ్యంలో 

బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ లో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో ట్రైన్ స్టెంట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన సినిమా  పోస్టర్‌లు, గ్లింప్స్‌లో రామ్ చరణ్ రూరల్, రస్టిక్ లుక్‌ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పక్కా గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందని అర్థమైంది. 'గేమ్ ఛేంజర్' ప్లాప్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ, వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Also Read: Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!

Advertisment
తాజా కథనాలు