TV actress : వరకట్న వేధింపులు.. సీరియల్ నటిని పొడిచి పొడిచి భర్త పరార్!

బెంగళూరులో టీవీ నటి శ్రుతిపై హత్యాయత్నం జరిగింది. ఆమె భర్త అమరేష్ కత్తితో పొడిచి పరారయ్యాడు.   ఈ సంఘటన బెంగళూరులోని హనుమంతనగర్ ప్రాంతంలో జులై 4న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై హనుమంతనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

New Update
tv-actress

బెంగళూరులో టీవీ నటి శ్రుతిపై హత్యాయత్నం జరిగింది. ఆమె భర్త అమరేష్ కత్తితో పొడిచి పరారయ్యాడు.   ఈ సంఘటన బెంగళూరులోని హనుమంతనగర్ ప్రాంతంలో జులై 4న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై హనుమంతనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రుతికి భుజం, తొడ, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యింది. ఆమె ప్రమాదం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు.  అమరేష్‌, శ్రుతిలకు 20 ఏళ్ల క్రితం పెళ్లి అయింది.  వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే గత 15 సంవత్సరాలుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని, కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని మూడు నెలల కిందట ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా గృహహింస కేసు కూడా నమోదైంది.  

మారిపోయానని చెప్పి

శ్రుతి ఏప్రిల్‌లో అమరేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం తన సోదరుడి ఇంట్లో ఉంటోంది. ఇటీవల, అమరేష్ మారిపోయానని చెప్పి ఆమెను తిరిగి తనతో కలిసి ఉండేలా ఒప్పించి తీసుకువెళ్లాడు. జులై 04వ తేదీన వారి ఇద్దరు కుమార్తెలు కళాశాలకు వెళ్లాక  అమరేష్ పెప్పర్ స్ప్రే, కత్తితో తనపై దాడి చేశాడని శ్రుతి తన వాంగ్మూలంలో పేర్కొంది. ఆమె కేకలు విన్న పొరుగువారు వచ్చి ఆమెను రక్షించారు. ఇంతలో అమరేష్‌ అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో బుల్లితెర వర్గాల్లో కలకలం రేగింది.  అమరేష్‌  ఆటో డ్రైవరు కాగా, శ్రుతి పలు సీరియల్స్ లో నటించింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు