Building collapse : ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!

ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. శనివారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలోని జనతా మజ్దూర్ కాలనీలో జరిగింది.

New Update
delhi-buliding

ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. శనివారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలోని జనతా మజ్దూర్ కాలనీలో జరిగింది. శిథిలాల్లో పలువురు నివాసితులు చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నలుగురిని సురక్షితంగా

భవనం కూలిన సమయంలో అందులో నివాసం ఉన్నవారు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. నలుగురిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద దాదాపు 12 మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.  భవనం కూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

కాగా శుక్రవారం తెల్లవారుజామున సెంట్రల్ ఢిల్లీలోని బారా హిందూ రావు ప్రాంతంలో మూడు అంతస్తుల భవనం కూలి 46 ఏళ్ల వ్యక్తి మరణించారు.  మృతుడిని మనోజ్ శర్మగా గుర్తించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శర్మ కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు