/rtv/media/media_files/2025/07/12/tdp-vs-ycp-in-gudiwada-2025-07-12-16-26-04.jpg)
Kodali Nani - TDP Flexi War
Kodali Nani - TDP Flexi War: కృష్ణాజిల్లా గుడివాడలో(Krishna District Gudivada) హైటెన్షన్ నెలకొంది. టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీగా నాగవరప్పాడు సెంటర్ కు చేరుకున్నారు. జై తెలుగుదేశం... గుడివాడ గడ్డ.. రామన్న అడ్డా.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. ఈ క్రమంలో నాగవరప్పాడు సెంటర్లోని కొడాలి నాని ఫ్లెక్సీ చింపేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులు రాళ్లు విసురుతూ ఫ్లెక్సీ చింపేసినట్లు తెలుస్తోంది. దీంతో నాగవరప్పాడు సెంటర్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వైసీపీ సమావేశం జరిగే కే కన్వెన్షన్ కు వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా గుడివాడలో భారీగా పోలీసులు మోహరించారు.
Also Read:HBD Shiva Rajkumar: 'హ్యాట్రిక్ హీరో' నిమ్మ శివన్న బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు మీకు తెలుసా!
నేడు గుడివాడలో వైసీపీ సమావేశం..
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గుడివాడలోని కే కన్వెన్షన్లో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కొడాలి నాని హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొడాలి నానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు చేశారు. కొడాలి నాని సీఎం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. చంద్రబాబు కుప్పంలో గెలిస్తే షూ పాలిష్ చేస్తానని గతంలో నాని సవాల్ విసిరారు. సవాల్ చేసిన సన్నాసి బయటికి రావాలంటూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొడాలి నాని సమావేశానికి వస్తున్నారని తెలిసే టీడీపీ వాళ్లు ఫ్లెక్సీలతో రెచ్చగొడుతున్నారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Also Read:Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!